(Kranthi Kumar, News 18, Bhadradri)
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా భద్రాచలం మీదుగా హైదరాబాదు (Hyderabad)కు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు ఇల్లందు పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో తెల్లవారుజాము నుంచి వాహన తనిఖీలు చేస్తుండగా అనుమనాస్పద రీతిలో వస్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా సదరు వాహనాన్ని ఆపపకుండా బారికర్లను ఢీకొని అతివేగంగా కారు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది ఇటు ఎక్సైజ్ అధికారులతో పాటు అటు పోలీస్ శాఖకు సమాచారాన్ని అందించారు.
జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన ఎక్సైజ్ , పోలీస్ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సదరు నిందితులు ఇల్లందు మీదుగా మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకొని.. ఇల్లందు పట్టణంలో ముమ్మర వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పద వాహనం తారసపడింది. సదరు వాహనాన్ని ఆపేందుకు ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్ బాబును యత్నించగా.. అతడిని ఢీ కొట్టి అలాగే ముందుకెళ్లింది. అతివేగంగా ముందుకు వెళ్తున్న క్రమంలో ఇల్లందు పట్టణంలోని ప్రధాన రహదారి మూలమలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని కొట్టింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు సంబంధిత వాహనాన్ని అదుపులోకి తీసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు కేజీల ప్యాకెట్ల రూపంలో ఉన్న 70 గంజాయి ప్యాకెట్ల 350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ21 లక్ష పైన ఉంటుందని ఇల్లందు డిఎస్పి రమణమూర్తి తెలియజేశారు.
అరెస్టు చేసిన నిందితులను విచారించగా ఒడిస్సా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్లు తెలియజేశారు. గంజాయి పట్టుబడిన విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు గంజాయి ఎక్కడ కొన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారు? అనేది పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం తెలియజేస్తామని ఇల్లందు డిఎస్పి రమణమూర్తి అన్నారు. ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ జాయింట్ ఆపరేషన్ లో జరిగిన ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Ganja smuggling, Local News