హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: ఘనంగా 60వ హోంగార్డ్స్ దినోత్సవ వేడుకలు

Bhadradri Kothagudem: ఘనంగా 60వ హోంగార్డ్స్ దినోత్సవ వేడుకలు

ఘనంగా జరిగిన వేడుకలు

ఘనంగా జరిగిన వేడుకలు

BhadradriKothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్నందు హోంగార్డ్స్ 60వ రైజింగ్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Kranthi Kumar, News 18, Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్నందు హోంగార్డ్స్ 60వ రైజింగ్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జిపాల్గొన్నారు. ముందుగా జిల్లా ఎస్పీహోంగార్డ్స్ ప్లాటూన్ కమాండర్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలోని హోమ్ గార్డ్స్ నాలుగు ప్లాటూన్స్ గా ఏర్పడి రైజింగ్ డే పరేడ్ ను నిర్వహించడం జరిగింది.

పరేడ్ అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్పూలతో సుందరంగా తయారుచేసిన వాహనంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, పరేడ్ కమాండర్ శేషు శ్రీనివాస్ లతో కలిసి ప్లాటూన్స్ ను వీక్షించారు. అనంతరం రైజింగ్ డేని ఉద్దేశించి ఎస్పీమాట్లాడుతూ పోలీస్ శాఖలో హోమ్ గార్డ్స్ సేవలు అభినందనీయమని అన్నారు. పోలీస్ శాఖలో అంతర్భాగమై పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న హోంగార్డ్స్ ఆఫీసర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదల నేపథ్యంలో కూడా నిరంతరం విధులు నిర్వర్తించి ప్రజలకు అండగా ఉన్న హోంగార్డ్స్ సేవలు ఆమోఘమని అన్నారు.

పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం హోంగార్డ్స్ వారి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలియజేశారు. 60వ రైజింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను హోమ్ గార్డ్స్ అందరితో కలిసి కట్ చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా విధులలో ప్రతిభ కనబరిచిన 54 మంది హోమ్ గార్డ్స్ కు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఇదిలా ఉండగా 1963, డిసెంబర్ 6న ప్రారంభమైన హోంగార్డు వ్యవస్థనేటితో 59 వసంతాలు పూర్తి చేసుకుని 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో బాధ్యాతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ పలువురి మన్ననలను పొందుతున్నారు హోంగార్డ్స్. జిల్లా వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ తో పాటు పలు విభాగాల్లో 454 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసులకు సపోర్టింగ్ స్టాఫ్, లాండ్ ఆర్డర్, బందోబస్తు, పెట్రోలింగ్, ట్రాఫిక్, ఔట్ పోస్ట్ (పెద్ద కంపెనీల వద్ద సెక్యూరిటీ విభాగంలో) డ్యూటీలు చేస్తున్నారు. రాజకీయ నాయకులకు భద్రతగా, పోలిస్ స్టేషన్ లకు సంబంధించి డ్రైవర్లుగా, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కుకింగ్ గా విధులు నిర్వహిస్తున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana