హోమ్ /వార్తలు /తెలంగాణ /

School girl missing: గిరిజన పాఠశాల నుంచి తప్పిపోయిన బాలిక ఆచూకీ లభ్యం: ఇంతకీ ఎలా దొరికిందో తెలుసా? 

School girl missing: గిరిజన పాఠశాల నుంచి తప్పిపోయిన బాలిక ఆచూకీ లభ్యం: ఇంతకీ ఎలా దొరికిందో తెలుసా? 

బాలికను ఎత్తుకుని తీసుకొస్తున్న పోలీసులు

బాలికను ఎత్తుకుని తీసుకొస్తున్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలిక బుధవారం కనిపించకుండా పోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (Tribal Girls Ashram School) మూడో తరగతి చదువుతున్న బాలిక (Girl) బుధవారం కనిపించకుండా పోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ములకలపల్లి మండలం చలమన్ననగర్ గ్రామానికి చెందిన బాలిక ఇటీవలే బూర్గంపాడు మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో అడ్మిషన్ పొందింది. ఈనేపథ్యంలో బుధవారం ఉదయం సదరు బాలిక హాస్టల్ ఆవరణలో కనిపించకపోవడంతో (School girl missing) ఆందోళన చెందిన హాస్టల్ వార్డెన్ చుట్టుపక్కల వెతకగా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే హాస్టల్ వార్డెన్ సామ్రాజ్యం ములకలపల్లిలో మండలంలో ఉంటున్న బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

  విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత, హాస్టల్ వార్డెన్ సామ్రాజ్యం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి.వినీత్ ఆదేశాల మేరకు పాల్వంచ డి.ఎస్పీ సత్యనారాయణ, సంబంధిత సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలిసు బృందాలతో తెల్లవార్లు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక కనిపించకుండా పోవడంతో (School girl missing) తల్లిదండ్రులు, బంధువులు బుధవారం రాత్రి ఆశ్రమ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నతాధికారులు సదరు పాఠశాలను సందర్శించి బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తప్పిపోయిన బాలిక దొరికే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని, బాలిక ఆచూకీ కోసం సుమారు 30 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు వివరించారు.

  ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం హాస్టల్ పైఅంతస్తులో ఖాళీ బెంచీల కింద పడుకొని ఉన్న బాలికను చూసిన తోటి విద్యార్థినులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు చేరుకుని బాలికను మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించి ప్రథమ చికిత్స అందించారు.

  అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక హోదాలను ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కోసం శ్రమించిన పోలీసు ఉన్నతాధికారులకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి.వినీత్ కు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చివరకు పాఠశాల ఆవరణలోనే బాలిక ఆచూకీ లభ్యమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలిక ఒంటరిగా బెంచీల కింద ఎందుకు పడిఉంది అనే విషయాన్నీ బాలిక చెప్పలేకపోతోంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadrari kothagudem, Local News, School girl

  ఉత్తమ కథలు