కరోనా వ్యాప్తించకుండా అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు... దేవాలయాల్లో సైతం రద్దీ తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఆలయానికి వచ్చినా... వారిని దర్శనం కోసం ఎక్కువ సేపు క్యూ లైన్లో వేచి ఉండకుండా దర్శనం కల్పించే అంశంపై అనేక దేవస్థానాలు దృష్టి సారించాయి. రోజూవారి దర్శనాల సంగతి ఎలా ఉన్నా... భద్రాచలంలో మాత్రం శ్రీరామనవమి నాడు నిర్వహించే రాములోరి కళ్యాణం ఈసారి ఎలా నిర్వహించాలనే దానిపై దేవస్థానం అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో ప్రతిఏటా సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది.
అయితే కరోనా కారణంగా ఈసారి రామయ్య కళ్యాణం ఎప్పటిలాగే మిథిలా స్టేడియంలో నిర్వహించాలా ? లేదా ? అనే దానిపై ఆలయ అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ 2న భద్రాద్రిలో జరిగే సీతారామ కల్యాణాన్ని బహిరంగంగా కాక ఆలయంలో నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. లక్షలాదిమంది భక్తులు రానున్న నేపధ్యంలో స్టేడియంలో కళ్యాణం నిర్వహించడం... ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆలయంలో కాకుండా కల్యాణ మంటపంలో వేడుక నిర్వహించే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందుంచాలని దేవస్థానం యోచిస్తోంది. ఆయన సూచనలను బట్టి ఈ అంశంపై ఆలయ అధికారులు ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.