హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kavitha: కవిత అరెస్ట్‌ అవుతుందా లేదా అని జోరుగా బెట్టింగ్‌! కోట్లు మారుతున్న చేతులు

Kavitha: కవిత అరెస్ట్‌ అవుతుందా లేదా అని జోరుగా బెట్టింగ్‌! కోట్లు మారుతున్న చేతులు

ED ముందు హాజరైన ఎమ్మెల్సీ కవిత

ED ముందు హాజరైన ఎమ్మెల్సీ కవిత

గతంలో ఐపీఎల్‌కు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు.. బుకీలు బెట్టింగులు కాచి కోట్లు సంపాదించేవారు.. కానీ కొత్తగా కవిత అరెస్టు అవుతుందా లేదా అంటూ బెట్టింగులు కాయడం మొదటిసారిగా చూస్తున్నామని...

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(పి. శ్రీనివాస్, న్యూస్ 18-తెలుగు, కరీంనగర్ జిల్లా)

ఇప్పుడు ప్రతీది బెట్టింగే.. మ్యాచ్‌ గెలుస్తుందా లేదా అన్న బెట్టింగ్‌ నుంచి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న బెట్టింగ్‌లు వరుకు చూస్తున్నే ఉన్నాం. తాజాగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా లేదా అన్న బెట్టింగ్‌ తెలంగాణలో జోరుగా సాగుతుందట.. ఈ బెట్టింగ్‌ కూడా కోట్లలో కొనసాగుతుందని సమాచారం. అరెస్టు అయితే ఎంత.. అరెస్టు కాకపోతే ఇంత అంటూ పెద్ద ఎత్తున బుకీలు దీనిని నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది.. అయితే ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్టి పారేస్తున్నారు.. ఇది కేవలం ప్రతిపక్షాల డ్రామాలు అని.. టీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కోలేక బీజేపీ చేస్తున్న కుట్ర అంటూ గులాబీ పార్టీ శ్రేణులు అంటున్నారు.

పెరుగుతున్న బెట్టింగ్‌ విపరీత బుద్ధి:

టీఆర్‌ఎస్‌ నేతల మాటలకు అటు బీజేపీ స్ట్రాంగ్‌గానే కౌంటర్‌ ఇస్తోంది. చట్టానికి ఎవరు అతిధులు కాదని.. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని అంటున్నారు. ఇక్కడ కక్షపూరిత చర్యలు ఏమి లేవని.. ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టే.. కవితని ఇప్పటికే మూడుసార్లు విచారించారని రివర్స్‌ కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో ఐపీఎల్‌కు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు.. బుకీలు బెట్టింగులు కాచి కోట్లు సంపాదించేవారు.. కానీ కొత్తగా కవిత అరెస్టు అవుతుందా లేదా అంటూ బెట్టింగులు కాయడం మొదటిసారిగా చూస్తున్నామని చాలామంది పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విధమైన బెట్టింగులు ఏ మాత్రం మంచిది కాదని.. దీన్ని వల్ల అమాయకులు డబ్బులు పొగొట్టుకునే అవకాశముందంటున్నారు.

ఈడీ అధికారికి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ:

ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈడి దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను అని తెలిపారు కవిత. ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ? అని ప్రశ్నించారు.దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ? అని ప్రశ్నించారు.  తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును తమ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు.  రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం అని లేఖలో పేర్కొన్నారు కవిత.

First published:

Tags: CBI, Delhi liquor Scam, Kalvakuntla Kavitha

ఉత్తమ కథలు