హోమ్ /వార్తలు /తెలంగాణ /

cm kcr :ఒలంపిక్స్‌‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేయండి..సీఎం కేసీఆర్ & కేటిఆర్

cm kcr :ఒలంపిక్స్‌‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేయండి..సీఎం కేసీఆర్ & కేటిఆర్

 Olympics

Olympics

cm kcr : టోక్యోలో నేటి నుండి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడ‌ల్లో పాల్గొంటున్న భార‌త క్రీడాకారుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేయాలని ఆకాంక్షించారు.

ప్ర‌పంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాల‌ను విర‌జిమ్మే ఆట‌ల సింగిడికి ప్ర‌తిరూపంగా నిలుస్తాయ‌ని సీఎం అభివ‌ర్ణించారు. ఒలింపిక్స్ క్రీడ‌ల్లో విజ‌యాలు సాధించి, స్వ‌ర్ణాల‌తో పాటు ప‌లు ప‌త‌కాలు గెలిచేలా భార‌త‌ క్రీడాకారుల‌కు శుభం జ‌ర‌గాల‌ని సీఎం కోరుకున్నారు. భార‌త‌దేశ కీర్తి ప‌తాకాన్ని విశ్వ‌వేదిక‌పై మ‌రోసారి ఎగ‌రేయాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.


Best wishes to all the Indian athletes at #Tokyo2020 from Shri @KTRTRS

మరోవైపు మంత్రి, రాష్ట్ర బాడ్మింటన్ అసోసియోషన్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం భారత కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా బాడ్మింటన్ అథ్లెట్స్‌కు ఆయన ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు. దేశం నుండి మొత్తం 120 క్రిడాకారులు పాల్గొంటున్న క్రిడల్లో విజయాల కోసం భారతీయులు ఆసక్తికరంగా వేచిచూస్తున్నారని తెలిపారు. క్రీడల్లో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటునాని అన్నారు.

First published:

Tags: CM KCR, KTR, Tokyo Olympics

ఉత్తమ కథలు