హైదరాబాద్‌కు 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్.. చెన్నై నుంచి తరలింపు..

చెన్నైలో నిల్వ ఉంచిన 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

news18-telugu
Updated: August 9, 2020, 9:24 PM IST
హైదరాబాద్‌కు 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్.. చెన్నై నుంచి తరలింపు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆగస్ట్ 4న లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఆ ముడిపదార్థాన్ని నిల్వచేసే దేశాలను అలర్ట్ చేసింది. చెన్నై పోర్టులోని కంటైనర్లలో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్‌ను భద్రతా కారణాల రీత్యా అక్కడి నుంచి తరలిస్తున్నారు. చెన్నైలో 37 కంటైనర్లలో ఉన్న 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలించే క్రమంలో మొదటి దఫాలో 10 కంటైనర్లు బయలుదేరినట్టు ఇండియా టీవీ రిపోర్ట్ చేసింది. దశల వారీగా దాన్ని హైదరాబాద్‌కు తరలిస్తారని, మరో రెండు రోజుల్లో మిగిలిన కంటైనర్లు కూడా బయలుదేరతాయని అధికారులు చెప్పినట్టు తెలిపింది. మార్గ మధ్యంలో ప్రమాదాన్ని నివారించేందుకు రోజుకు పది కంటైనర్ల చొప్పున పంపనున్నట్టు అధికారులు చెప్పారు. ఈ 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కొరియా నుంచి 2015లో దిగుమతి అయ్యాయి. ఎరువుల పేరుతో దీన్ని అమ్మన్ కెమికల్స్ అనే కంపెనీ కొరియా నుంచి దిగుమతి చేసుకుంది. అయితే, దిగుమతిదారుకు సరైన లైసెన్స్ లేనందున కస్టమ్స్ అధికారులు మొత్తం సరుకును స్వాధీనం చేసుకున్నారు. మనాలిలోని కంటైనర్ నిల్వ కేంద్రంలో ఉంచారు. దీన్ని హైదరాబాద్‌కు తరలించి ఎక్కడ భద్రపరుస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 9, 2020, 9:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading