Home /News /telangana /

BEGGER SUPPORTS TO FREE DISTRIBUTION OF FOOD TO THE BEGGERS VRY

TS news : బిచ్చగత్తె... దానకర్తగా మారింది. కారణం తెలిస్తే.. షాకే మరి..!

అన్నదానం చేస్తున్న యాచకురాలు

అన్నదానం చేస్తున్న యాచకురాలు

TS news : ఆమె ఓ యాచకురాలు, రోజు పదిమందిని అడుక్కుంటే కాని రోజు పొట్ట నిండని పరిస్థితి. కాని ఆమె పదిమందికి ఆదర్శంగా నిలిచింది.. తాను యాచించి.. కడుపు నింపు కోవడమే కాకుండా వచ్చిన డబ్బుతో మరో పదిమంది యాచకులకు అన్నదానం చేస్తోంది. అయితే ఆమె ఇలా ఎందుకు మారిందనేది మాత్రం ఆసక్తికరమైన అంశం.

ఇంకా చదవండి ...
  చావు చివరి అంచులకు పోతే కాని అసలు జీవిత( life) సత్యం తెలియదని అంటారు.. ఇలా చాలా మందికి ఏదైన అనారోగ్యం పాలై కోలుకున్న తర్వాత గాని, ప్రమాదం జరిగిన తర్వాత బతికి బట్టకట్టిన సంధర్బంలో వారికి జ్ఝానోదయం అవుతుంది. ఇలా ఓ యాచకురాలికి కూడా జీవిత సత్యాన్ని తెలుసుకుంది.. తాను చావు(Death )చివరి అంచుల వరకు వెళ్లి, తనను బతికించమని దేవుడిని వేడుకుంది.. అనారోగ్యం నుండి తనను బయట పడేయాలని దేవున్ని కోరుకుంది. దీంతో ఆమె కోరుకుంటున్నట్టుగానే తిరిగి అనారోగ్యం(Health ) నుండి కోలుకుంది. దీంతో తాను మొక్కులను తీర్చేందుకు ముందుకు వచ్చిన ఘటన పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్‌లో వెలుగు చూసింది.

  దానం చేయాలంటే ధనమే ఉండనవసరం లేదు.. మంచి మనసుంటే చాలు అంటుంది ఆమె. దాతృత్వం కు పేదరికం అడ్డు కాదాని నిరూపిస్తుంది. రోజు అన్నం కోసం యాచించే వృద్ధురాలు.. తాను యాచించిన డబ్బులతో నలుగురికి రోజుకు రెండు పూటల భోజనం పెడుతుంది. అటువంటి గొప్ప మనసు గల
  యాచకురాలి పై న్యూస్18 ప్రత్యేక కథనం.

  ఇది చదవండి : భర్త ఇంటికి రాడని పక్కింటి కుర్రాడిని రమ్మంది....! ఇద్దరు ఒకే గదిలో ఉండగా అత్త గొళ్లెం పెట్టింది అంతే...!


  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంకు చెందిన చాట్ల లచమ్మ అనే వృద్ధురాలు సుల్తానాబాద్ లోని శ్రీ వేణుగోపాలస్వామి గుడి బయట యచకురాలుగా జీవనము గడుపుతోంది... ఇలా చాలా రోజుల నుంచి యాచించిన డబ్బులతో రోజువారీ అవసరాలను తీర్చుకునేది. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే వేణుగోపాలస్వామి కి మొక్కుకుంది. తనకు వచ్చే డబ్బులతో తోటి యచకులకు తన వంతుగా రెండు పూటలా భోజనం పెడతానని మొక్కు కోగా.. తన ఆరోగ్యం కుదుటపడిందని వృద్ధురాలు చెపుతుంది.

  గోడలే.. బ్లాక్ బోర్డులుగా.. ఊరే ఓ పాఠశాలగా ప్రభుత్వ టీచర్ వినూత్న ఆలోచన..!


  అలా మొక్కిన అప్పటినుండి తను అడుక్కున డబ్బులతో (free food distribution) నిత్యాన్నదానం చేస్తుంది. ఆమెకు తోడుగా రాజకుమార్ అనే సామజిక కార్యకర్త కూడా తోడు అయ్యాడు. తాను యాచించడం ద్వారా వచ్చిన డబ్బులను రాజకుమార్ కు ఇచ్చి వంటలు చేయించి, తోటి యాచకులతో పాటు అన్నం కోసం వచ్చే ఇతరులకు రెండు పూటలా భోజనం పెడుతుంది. మరోవైపు ఇలా చేయడానికి కారణం కూడా చెబుతోంది.. తన మొక్కు తీర్చుకోవడంతో పాటు తనకు భర్త, పిల్లలు ఎవరూ లేరని, అందుకే ఉన్నదాంట్లో అన్నదానం చేస్తున్నానని చెబుతోంది.

  ఇది చదవండి : చెల్లెలికి అన్న గ్రేట్ గిఫ్టు.. హెల్త్ ఇన్సూరెన్స్ ‌, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ ఎందుకో తెలుసా... ?


  దీంతో ఆమె చేస్తున్న పనిని స్థానికులు ప్రశంసిస్తున్నారు.. సామాజిక సేవ చేయాలనుకునేందుకు డబ్బు అవసరం లేదని, మనసుంటే చాలని అంటున్నారు.కాగా యాచకురాలు చేస్తున్న అన్నదానంపై పలువురు సోషల్ మీడియాలో కూడ పోస్ట్‌లు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ( social media ) పలువురు ఆమె సేవలను కొనియాడుతూ రీ పోస్టు పెట్టడడంతో ఆమె సేవలు వైరల్‌గా మారాయి.. ఏది ఏమైన మనసుంటే మార్గం ఉంటుందని ఆమె మరోసారి రుజువు చేసిందని చెబుతున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Life Style, Peddapalli, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు