నిరాడంబరంగా మేడే వేడుకలు జరుపుకున్న బీడీ కార్మికులు...

నిరాడంబరంగా మేడే వేడుకలు... జరుపుకున్న బీడీ కార్మికులు...

కరోనా విపత్తు కార‌ణంగా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైంది...

  • Share this:
    నిజామాబాద్ జిల్లా: అంతర్జాతీయ కార్మిక మేడే దినోత్సవం నిజామాబాద్ జిల్లాలో నిరాడంభారంగా జ‌రిగింది. న‌గ‌రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట‌, తెలంగాణ ప్రగతిశీలబీడీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఎదుట‌ జెండా ను ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు ఆవిష్కరించారు.. ఈ సంద‌ర్బంగా వనమాల కృష్ణ మాట్లాడూతూ.. క‌రోనా వైర‌స్ ప్ర‌జావ్య‌వ‌స్థను ఆత‌లా కూత‌లం చేస్తుంద‌న్నారు.. కరోనా విపత్తు కార‌ణంగా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి కార్మికునికి అందివ్వాలన్నారు. వలస కార్మికులకు కరోనా టెస్టులు జరిపి, వారి స్వస్థలాలకు వెంటనే పంపించాలన్నారు. యాజమాన్యాలు కార్మికులకు ఎలాంటి కోత విధించకుండా వేతనాలు ఇవ్వాలని.. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి అమలు చేయించాలన్నారు. కార్మికులు ఎన్నో పోరటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలు 12 గంటలకు మార్చాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంద‌న్నారు.. ఈ కుట్రలను ఆపివేయాలని హెచ్చరించారు.. మోడీ ప్రభుత్వం కార్మికుల జీవితాలను గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, దేశంలోని కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు నిరసించాలన్నారు.
    Published by:Venu Gopal
    First published: