కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో రెండు ఎలుగుబంట్లు పడ్డాయి. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కో అప్షన్ సభ్యులు కత్తుల దేవేందర్ యాదవ్ వ్యవసాయ బావిలో ఆదివారం రాత్రి ఎలుగుబంట్లు పడినట్లు గ్రామస్తులు తెలిపారు. తెల్లవారుజామున అరుపులు విని బావిలో చూసేసరికి రెండు ఎలుగుబంట్లు నీటిలో ఉన్నాయని తెలిపారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి నుండి నీటిలో ఉన్న ఎలుగుబంట్లు ఇబ్బందులు పడ్డాయి. కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు.. వాటిని బావిలోంచి తీయడానికి పలు ప్రయత్నాలు చేశారు. పొద్దంతా వాటిని బావిలోంచి బయటకు తెప్పించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
దీంతో అధికారులు.. ఒక వలను బావిలోకి విసిరి బయటకు తీశారు. వైద్యం చేసాక అటవీ లో వదిలి పెడతామని అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎక్కడి నుండి వచ్చాయి ఎలా వచ్చాయి అని అటవీశాఖ అధికారులు ఆరాదీశారు. ఆ గ్రామానికి చుట్టు పక్కల గుట్టలు ఉండడం తో నీటి కోసం వచ్చి బావిలో పడ్డాయని స్థానికులు చెపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Telangana