నీటిలో పడ్డ ఎలుగుబంటి.... కాపాడబోయినవారిపైనే దాడి

నీటిలో పడ్డ ఎలుగుబంటిని రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. వలలు, తాళ్లు వేస్తూ... ఎలుగును రక్షించేందుకు ప్రయత్నించారు.

news18-telugu
Updated: March 22, 2019, 2:09 PM IST
నీటిలో పడ్డ ఎలుగుబంటి.... కాపాడబోయినవారిపైనే దాడి
తెలుగుగంగ రిజర్వాయర్‌లో ఎలుగుబంటి హల్‌చల్
news18-telugu
Updated: March 22, 2019, 2:09 PM IST
కర్నూలు జిల్లా వెలుగోడు తెలుగు గంగ రిజర్వాయర్లో ఎలుగుబంటి ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో నీటిలో పడ్డ ఎలుగుబంటిని రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. వలలు, తాళ్లు వేస్తూ... ఎలుగును రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే జనం అరుపులు, కేకలు విన్న ఎలుగుబంటి బెదిరిపోయింది. తనను కాపాడుతున్నవారిపైనే దాడి చేసింది. వెలుగోడు తెలుగు గంగ రిజర్వాయర్ మద్రాసు కాలవ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం వెలుగోడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు మీదుగా కర్నూలుకు తరలించారు.First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...