తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో ఖాలీగా ఉన్న మున్సిపల్ కార్పోరేషన్లు మరియు మున్సిపాలిటిల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర్ర ఎన్నికల సంఘం ముందస్తు ప్ర్రక్రియ ప్రారంభించింది.ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లతో అత్యవసరంగా సమీక్షించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి తీసుకోవాల్సిన అంశాలపై నోటిఫికేషన్ విడుదల చేశామని. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సీ. పార్థసారధి రెడ్డి అన్నారు.
కాగా రాష్ట్రంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పోషన్, సిద్దిపేట, నకేరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, నిర్వహించనున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు మరియు మరికొన్ని మున్సిపలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు కూడ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు.
ఈ నేపనథ్యంలోనే ఓటర్ల జాబితా, పోలీంగ్ స్టేషన్ల గుర్తింపు లాంటీ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు , మున్సిపల్ కమీషనర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైందని, కమీషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు కూడ సాధారణ ఎన్నికకు సంభందించిన నియామవలి వర్తిస్తుందని ఆయన తెలిపారు.ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇండేలిబుల్ ఇంకు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి CDMA పర్యవేక్షిస్తారన్నారు.
ఇక ఇప్పటికే ఈ నెల 5న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశామని, వాటిపై అభ్యంతరాలను పరీశీలించి, తుది ఓటర్ల జాబితాను ఏప్రిల్ 11 న విడుదల చేస్తామని చెప్పారు. మరోవైపు ఏప్రిల్ 14న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో చేయవలసిన వివిధ పనులను, వాటిని పూర్తి చేయవలసిన తేదీలను సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టిక తయారు చేసి అందరు మున్సిపల్ కమీషనర్ లకు పంపడం జరిగిందని, సంబంధిత జిల్లా కల్లెక్టర్లు నిర్ణీత తేదీలలో ఆయా పనులు తుచాతప్పకుండా జరుగునట్లు చూడవలెనని కోరారు.
కోవిడ్ -19 కు సంబంధించి ప్రత్యేకంగా సూచనలు జారీచేయడం జరిగిందని, వాటిని తప్పనిసరిగా పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Municipal Elections, Telangana