BE ALERTED OF OMICRON VIRUS SAID MINISTER HARISH RAO VRY
Harish rao : ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.. కాని ప్రాణభయం లేదు.. 25వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్దం
మంత్రి హరీశ్ రావు (పాత ఫొటో)
Harish rao : ఒమిక్రాన్ కేసులు మొదటి సారిగా హైదరాబాద్ నగరంలో బయటపడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సుమారు 25 వేల బెడ్స్ సిద్దం చేశామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
ఒమిక్రాన్ కేసులు మొదటి సారిగా హైదరాబాద్ నగరంలో బయటపడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సుమారు 25 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్దం చేశామని మంత్రి హరీష్ రావు చెప్పారు. దీంతో పాటు 21 లక్షల ఐసోలేషన్ కిట్లు సైతం సిద్దం చేసినట్టు ఆయన చెప్పారు. ఒమిక్రాన్ ప్రభావం తగ్గించేందుకు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. దీని వల్ల ప్రాణభయం లేదు కాని చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇందుకోసం 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలోనే ముప్పై నుండి నలబై వేల వరకు టెస్టులు చేస్తున్నామని చెప్పారు. ఇక భవిష్యత్ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి సంధర్భాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇక బూస్టర్ డోసుపై కూడా కేంద్రానికి లేఖ రాశామని ఆయన తెలిపారు.
కాగా హైదరాబాద్‌లో నేడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి ప్రజారోగ్య శాఖ డైరక్టర్ శ్రీనివాసరావు వివరాలు తెలిపారు. ఈ రెండు కేసులు కూడా విదేశాలకు చెందిన వారుగా చెప్పారు. వీరిలో ఒకరు సోమాలియా మరోకరు కెన్యా దేశాలకు చెందిన వారుగా గుర్తించారు. దీంతో ఆ ఇద్దరిని కూడా టిమ్స్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించినట్టు చెప్పారు. దీంతో వారికి కాంటాక్ట్‌లో ఉన్నవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో ఒమిక్రాన్ భయం హైదరాబాద్‌కు చేరడంతో పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.