BE ALERT ON OMICRON FOR COMING FOUR WEEKS WARNS HEALTH DEPARTMENT VRY
Omicron Alert : కమ్యూనిటిలోకి చేరింది.. రాజకీయా పార్టీలు వారి కార్యక్రమాలను రద్దు చేసుకొండి..!
ప్రతీకాత్మక చిత్రం
Omicron Alert : ఒమిక్రాన్ వేరియంట్‌పై తెలంగాణ ప్రజలను ఆరోగ్యశాఖ డైరక్టర్ మరోసారి హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటిలోకి స్ప్రెడ్ అయిందని చెప్పారు.
ఒమిక్రాన్ ధర్డ్ వేవ్, ప్రారంభమైన నేపథ్యంలోనే తెలంగాణ ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తమైంది. ఈక్రమంలోనే ప్రజలు ఎవరికి వారే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.కేవలం పరీక్షలపై ఆధారపడకుండా ఎవరికి వారు ముందు జాగ్రత్త ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రభుత్వం ఎలాంటీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోయినా... ప్రజలే అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఒమిక్రాన్ కమ్యూనిటిల్లోకి రావడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ముఖ్యంగా వచ్చే నాలుగు వారాలు అంత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.. ఒకవేళ ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని లేదంటే వ్యక్తిగత వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని చెప్పారు. అంతే కాని స్వంత వైద్యం మానుకోనాలని చెప్పారు. ఇక నేటి నుండి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం జ్వరం వచ్చిన వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించనున్నట్టు చెప్పారు. ఒకవేళ ఒమిక్రాన్ లక్షణాలు ఉంటే వారికి అక్కడే మెడిసిన్ కిట్లు ఇస్తారని చెప్పారు. ఇక ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వారు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో ఉంచిందని , ఇక పరీక్షలకు సంబంధించి కూడా సుమారు రెండు కోట్ల కిట్స్‌ను అందుబాటులో ఉంచిందని చెప్పారు. దీంతో పాటు ప్రైవేటుగా కూడా కిట్స్ లభిస్తున్నాయని ఆయన వివరించారు. మొత్తం మీద ప్రభుత్వ పరంగా పూర్తిగా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖలో సెలవులు రద్దు చేశామని చెప్పారు. రాబోయో రోజుల్లో మాస్ గ్యాదరింగ్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు..
రానున్న నాలుగు వారాల పాటు రాజకీయ నాయకులు వారి కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని సూచించారు. అప్పుడే వ్యాప్తిని అదుపులో పెట్టేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో రాకుండా ఉండేందుకు నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఝప్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు, నాయకులు తూచ తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.