హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : ఆర్ క్రిష్ణయ్యకు 1000కి పైగా బెదిరింపు కాల్స్.. డీజీపీకి ఫిర్యాదు.. కారణం ఇదే..

Hyderabad : ఆర్ క్రిష్ణయ్యకు 1000కి పైగా బెదిరింపు కాల్స్.. డీజీపీకి ఫిర్యాదు.. కారణం ఇదే..

ఆర్ క్రిష్ణయ్య ఫైల్ ఫోటో

ఆర్ క్రిష్ణయ్య ఫైల్ ఫోటో

Hyderabad : బీసీ సంఘం నేత ఆర్ క్రిష్ణయ్యకు బెదింపులు వస్తున్నాయంటూ రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి మహముద్ ఆలీలకు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకు మద్దతు పలికావంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ క్రిష్ణయ్యపై పడింది. జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ క్రిష్ణయ్య టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. దీంతో పాటు ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా బీసీ అయినా.. మద్దతు మాత్రం గెల్లు శ్రీనివాస్‌కు ప్రకటించారు. కాగా అంతకుముందు సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన వింత పరిస్థితి ఎదుర్కొన్నారు.. ఎన్నికల్లో ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టీఆర్ఎస్‌కు ఎందుకు మద్దతు పలికారో అడగలాంటూ ఆయన ఫోన్ నంబర్‌ను సైతం పోస్ట్ చేశారు..

ఈ క్రమంలోనే ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.. దీంతో పాటు సోషల్ మీడియాలో తన ఫోన్‌ నంబర్‌ను ఎవరో పోస్ట్‌ చేశారని, దీంతో కొందరు ఆ నంబర్‌కు ఫోన్‌చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌కు ఎందుకు మద్దతు ఇచ్చావు, ఈటల ఓటమిని ఎందుకు కోరావు అంటూ తనను ఆగంతకులు బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి వెయ్యికి పైగా ఇలాంటి కాల్స్‌ వచ్చాయని తెలిపారు.

ఇది చదవండి : : నగర పోలీసులకు వింత అనుభవం.. డబ్బు కావాలా... నిందితులు కావాలా.. అంటూ చాన్స్...


మరోవైపు కొన్ని శక్తులు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇటీవల తాను అభినందించడం వల్లే బెదిరింపులకు దిగుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నలభై ఏండ్లుగా బీసీల కోసం పనిచేస్తున్నానని, దీనివెనుక ఎవరున్నారో కనుక్కోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.. దీనిపై హోంమంత్రి, డీజీపీ స్పందిస్తూ బెదిరింపు కాల్స్‌ చేస్తున్నవారితోపాటు ఫేస్‌బుక్‌లో నంబరు పెట్టిన వారి ఆచూకి తెలుసుకుంటామని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీర్ఎస్ , బీజేపీ మధ్య హోరాహోరి ఉత్కంఠ పోరు కొనసాగిన విషయం తెలిసిందే.. ఈ పోరులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23 వేల ఓట్ల మెజారీటితో గెలుపొందారు. దీంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఉత్సహం నిండడంతో  పాటు టీఆర్ఎస్ , బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ పోరు కొనసాగుతోంది.

First published:

Tags: Huzurabad, Hyderabad, Telangana

ఉత్తమ కథలు