BATUKAMMA SAREES DISTRIBUTION FROM TODAY IN TELANGANA VB
Bathukamma Sarees: నేటి నుంచి పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు.. ఈ సారి చీరలు ఎన్ని వర్ణాల్లో ఉన్నాయో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
Bathukamma Sarees: రాష్ట్ర పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలు, ఇండ్ల వద్దకు చీరలు చేరాయి. ఈ నెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
రాష్ట్ర పండుగ బతుకమ్మ(Bathukamma)ను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం(Government) ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలు, ఇండ్ల వద్దకు చీరలు చేరాయి. ఈ నెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. గాంధీ జయంతి (అక్టోబర్ 2) నుంచి చీరల పంపిణీని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. యువతులు, మహిళలు అందరికీ పండుగ కానుకగా కోటి చీరలను పంపిణీ చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు గ్రామాల వారీగా ఏర్పాట్లు చేశారు. చేనేత కార్మికులకు చేయూత నివ్వాలనే ఆలోచనతో బతుకమ్మ పండుగకు చీరలను అందిస్తోంది ప్రభుత్వం. బతుకమ్మ చీరలతో మూడు నెలలుగా చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
18 ఏండ్లు పైబడి రేషన్ కార్డులో పేరు నమోదైన వారికి చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 810 రకాల చీరలను, 1.08 కోట్ల మహిళలకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. బతుకమ్మ చీరల కోసం రూ. 333.14 కోట్లు ఖర్చు చేశారు.
సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలో మరమగ్గాలపై తయారు అయిన చీరలను రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
గత సంవత్సరం కంటే ఈ ఏడాది చాలా ఎక్కువ డిజైన్లను రూపొందించామన్నారు టెస్కో అధికారులు. మరమగ్గాలపై తయారైన చీరలను వాష్ చేసి, నీట్గా ప్యాకింగ్ చేసి జిల్లా కేంద్రాలకు పంపిస్తోంది టెస్కో సిబ్బంది. కోటి చీరల్లో ఇప్పటికే 90 శాతం చీరలు..జిల్లా కేంద్రాలకు చేరాయన్నారు అధికారులు. ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారుచేయించారు.
గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 వర్ణాలలో సరికొత్తగా రూపొందించారు. డాబీ అంచు చీరలు ఈ సారి బతుకమ్మ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.
అటు, చీరల ప్యాకింగునూ ఆకర్షణీయంగా చేశారు. చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెండి, బంగారు రంగు జరీలతో పాటు డాబి, జాకాడ్ అంచుల డిజైన్లతో చీరలు అందిస్తామన్నారు జౌళిశాఖ ఎండీ శైలజా రామయ్యర్.
అక్టోబర్ మొదటివారంలో బతుకమ్మ చీరలను పూర్తి స్థాయిలో పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశారు టెస్కో అధికారులు. చీరల పంపిణీ వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు అందించామన్నారు. గ్రామస్థాయిలో పంపిణీకి సంబంధించి అధికారులకు సూచనలు చేస్తున్నారు. పంపిణీ బాధ్యతలను ఆయా గ్రామంలోని గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఇతర అధికారులు తీసుకోనున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.