Home /News /telangana /

Bathukamma: బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన కారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర దుమారం

Bathukamma: బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన కారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర దుమారం

Bathukamma: బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఎమ్మెల్యే ధర్మారెడ్డి అగౌరవపరిచారని కాంగ్రెస్ నేత వీహెచ్ మండిపడ్డారు. గతంలో దళితులను అవమానించిన ఎమ్మెల్యే, ఇప్పుడు బతుకమ్మను కారుతో తొక్కించారని... ఆయనది కుల అహంకరామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తెలంగాణ (Telangana)లో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ (Bathukamma) సంబరాలుమొదలయ్యాయి. మహిళలంతా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను చేసి... ఆటపాటలతో.. సందడి చేస్తున్నారు. ఐతే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే  ఈ బతుకమ్మల మీదుగా ఓ ఎమ్మెల్యే కారు దూసుకెళ్లింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Challa Dharmareddy)  బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతోంది.  ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యేవి అయి ఉండి.. బతుకమ్మ పండగను  అవమానిస్తారా? తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారా? అంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు.

    Hyderabad Rains: ఇవి రోడ్లేనా? చెరువులా? హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. షాకింగ్ వీడియోలు

    బుధవారం సాయంత్ర హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పర్యటించారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. అక్కడ సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఐతే అదే సమయంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట స్థానిక మహిళలు బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని.. రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని వారికి ధర్మారెడ్డి అనుచరులు చెప్పారు. ఐతే మహిళలు అలా తీసేయడం కుదరదని స్పష్టం చేశారు. బతుకమ్మ ఆడేందుకు ఒక దగ్గర పెట్టిన తర్వాత.. నిమజ్జనం చేసే వరకు మధ్యలో మళ్లీ తీసి వేరొక చోట పెట్టకూడదని అన్నారు. అలా చేస్తే అరిష్టమని వివరించారు. అందుకే బతుకమ్మలను అక్కడి నుంచి తీసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. కారును ఓ పక్క నుంచి పోనీయాలని సర్పంచ్ చెప్పినా.. ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు వినిపించుకోలేదు. బతుకమ్మ ఆడుతున్నమహిళలను తోసేసి.. బతుకమ్మల మీదుగా కారును పోనిచ్చారు.

    TS Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ.. నేతలతో  మంతనాలు

    ఎమ్మెల్యే తీరుపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారును అడ్డుకొని డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు.  వారిని పోలీసులు తోసివేయడంతో కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే ధర్మారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహాంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు.  బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఎమ్మెల్యే ధర్మారెడ్డి అగౌరవపరిచారని మండిపడ్డారు. గతంలో దళితులను అవమానించిన ఎమ్మెల్యే, ఇప్పుడు బతుకమ్మను కారుతో తొక్కించారని... ఆయనది కుల అహంకరామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఐతే ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను  తాను అవమానపరచలేదని, మహిళలను గౌరవించి  కారు దిగి నడుచుకుంటూ వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో తాను కారులో లేనని చెప్పుకొచ్చారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bathukamma, Bathukamma 2021, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు