Home /News /telangana /

BARS AND WINES WILL BE OPENED AT MIDNIGHT ON DECEMBER 31ST VRY

December 31st Celebrations : మందు బాబులకు గుడ్ న్యూస్.. ఆ రోజు అర్థరాత్రి వరకు మందు సేల్..

liqour shop

liqour shop

December 31st : 31st డిశంబర్ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు మందుబాబుల కోసం ఆ రోజు అర్థరాత్రి వరకు బార్లు, వైన్స్‌లు తెరిచి ఉంటాయని తెలిపింది.

    ఓ వైపు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నా ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ రోజు పార్టీలకు అర్థరాత్రి వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని బార్లు,వైన్స్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం షాపులతో సహా,నగరంలో నిర్వహించే ఈవెంట్లకు కూడా అవకాశం కల్పించింది.

    ఈ మేరకు నూతన సంవత్సరం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే.. డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది. దీంతో అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు స్వేచ్చగా సంబరాలు చేసుకునే అవకాశం కల్పించినట్టయింది.. అయితే రాష్ట్రంలో జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఇటీవలే పోలీసు శాఖతో పాటు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే వీటిని పక్కన పెట్టి మద్యం షాపులకు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bar and restaurants, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు