హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మెల్యేల బేరసారాల కేసు..జైలు నుండి సింహయాజి విడుదల..ఆ ఇద్దరు మాత్రం..

ఎమ్మెల్యేల బేరసారాల కేసు..జైలు నుండి సింహయాజి విడుదల..ఆ ఇద్దరు మాత్రం..

నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి

నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి

ఎమ్మెల్యేల బేరసారాల కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది హైకోర్టు. ప్రతీ సోమవారం సిట్ (Special Investigaion Team) ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లోద్దని హైకోర్టు  (Telangana High Court) పేర్కొంది. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. చివరకు నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జగిత్యాల నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర..కేసీఆర్ బహిరంగ సభకు భారీ కాన్వాయ్ లో బయలుదేరిన కవిత

చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సింహయాజి..ఆ ఇద్దరు మాత్రం జైల్లోనే..

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజిల (Simhayaji)కు ఇటీవల బెయిల్ లభించింది.  అయితే డిసెంబర్ 1న వీరికి బెయిల్ లభించగా రూ.3 లక్షలు పూచికత్తు సహా మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో ఆలస్యం అయినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా నేడు చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై సింహయాజి విడుదల అయ్యారు. ఇక రామచంద్రభారతి (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar) కు కూడా బెయిల్ లభించగా వారిపై వేర్వేరు కేసులు ఉండడంతో జైల్లోనే ఉన్నారు.

TS Police Jobs: రేపటి నుంచే పోలీస్ జాబ్స్ ఈవెంట్స్.. అలా చేస్తే దరఖాస్తు రద్దు.. తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే..

ఏసీబీ కోర్టులో ఇలా..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అలాగే BL సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై రివిజన్ పిటీషన్ వేసిన సిట్ కోర్టు వ్యాఖ్యలను హైకోర్టులో సవాల్ చేసింది.

హైకోర్టులో అలా..

ఇక ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని బీజేపీ పిటీషన్ వేసింది. అలాగే ఇదే డిమాండ్ పై మరికొన్ని పిటీషన్లు వచ్చాయి. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణ నేటికీ వాయిదా వేసింది. నేడు మరోసారి నిందితుల తరపు వాదనలు విననుంది కోర్టు. మరి నేడు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

First published:

Tags: Hyderabad, Telangana, Telangana News, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు