నిధుల గోల్‌మాల్ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఉదయం రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీతాఫల్ మండిలోని జడ్జి నివాసంలో హాజరపరచగా..రవి ప్రకాష్‌కు ఈనెల 18 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. ఏడాది కాలంలో సుమారు రూ.18 కోట్ల మేర టీవీ9 నిధులను రవి ప్రకాష్ బృందం దారిమళ్లించినట్లు అలందా మీడియా ఆరోపిస్తోంది. గత నెలలో అలందా మీడియా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజార హిల్స్ పోలీసులు శనివారం రవిప్రకాష్‌ను అరెస్ట్ చేశారు.
రవిప్రకాష్‌పై టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలందా మీడియా పెట్టిన పలు కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం, సైబర్‌క్రైమ్ నేరాలకు పాల్పడ్డారంటూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ కేసుల విచారణకు రవిప్రకాష్ పలుమార్లు హాజరై సమాధానమిచ్చారు. అనంతరం కొంత కాలంగా ఈ కేసుల్లో పురోగతి లేదు. ఐతే శనివారం ఒక్కసారిగా రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. రవిప్రకాష్‌తో పాటు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని సైతం అదుపులోకి తీసుకొని విచారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Ravi prakash, Telangana, TV9