టీవీనైన్ వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన పదిమంది పోలీసులు బృందం ... కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా రవిప్రకాశ్ అరెస్టు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం బంజారా హీల్స్ ఏసీపీ రవిప్రకాష్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్‌తో పాటు మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని కూడా విచారిస్తున్నారు పోలీసులు.
ఇప్పటికే రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లో ఫండ్‌ను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవి ప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. దీంతో పాటు గతంలో టీవీ9 ఆఫీసుకు వెళ్లిన పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలు కూడా రవిప్రకాష్‌పై ఉన్నాయి. ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 crpc కింద నోటీసులిచ్చారు. ఈ రెండింటిలో కూడా గతంలోనే అధికారులు విచారించారు.మరో సారి ఇప్పుడు కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Ravi prakash, Telangana, Telangana Police, TV9