రేపు బండి సంజయ్ ఉపవాస దీక్ష.. ఎందుకో తెలుసా..

Video : తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ బండి సంజయ్..

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయనున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

  • Share this:
    కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపడుతున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయనున్నట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వానికి ప్రజలు, రైతులు సహకరిస్తున్నా.. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేసుకోవడం.. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఐకేపీ సెంటర్లలోనే ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం చేపట్టే ఉపవాసదీక్షలో రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా, మండల అధ్యక్షులు ఎవరి ఇంట్లో వారు చేపట్టాలని పిలుపునిచ్చారు.
    Published by:Narsimha Badhini
    First published: