పోలీసుల అరెస్ట్‌పై సినీ నిర్మాత బండ్ల గణేష్ క్లారిటీ..

పీవీపీని బెదిరించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారని.. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన గణేష్.. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: October 23, 2019, 8:33 PM IST
పోలీసుల అరెస్ట్‌పై  సినీ నిర్మాత బండ్ల గణేష్ క్లారిటీ..
బండ్ల గణేష్ ఫైల్ ఫోటో
  • Share this:
బండ్ల గణేష్‌ను అరెస్ట్ చేశారన్న వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. తననెవరూ అరెస్ట్ చేయలేదని.. విచారణకి పిలిస్తే వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. చట్టంపై ఉన్న గౌరవంతో పోలీసులకు సహకరిస్తున్నానని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఒకవేళ అరెస్టైతే తానే అందరికీ తెలియజేస్తానని చెప్పారు బండ్ల గణేష్. కాగా, బుధవారం సాయంత్రం బండ్ల గణేష్‌ను అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. పీవీపీని బెదిరించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారని.. బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన గణేష్.. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు.
జూనీయర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబీనేషన్‌లో వచ్చిన టెంపర్ సినిమా బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక మరో ప్రొడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ సంస్థ ఓనర్) ఆ మూవీకి ఫైనాన్షియర్‌గా ఉన్నారు. టెంపర్ సినిమా కోసం నిర్మాత బండ్ల గణేశ్‌కు పీవీపీ రూ. 30కోట్లు పెట్టుబడిగా ఇచ్చారు. ఐతే సినిమా విడుదల సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించిన బండ్ల గణేష్.. మరికొంత మొత్తాన్ని చెక్కుల రూపంలో పీవీపీకి అందించారు. ఐనా మరో రూ.7 కోట్ల మేర బాకీ పడ్డారు గణేష్. ఆ డబ్బులను చెల్లించాలని బండ్ల గణేష్‌పై పొట్లూరి వరప్రసాద్ ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే పొట్లూరి వరప్రసాద్‌ను తన అనుచరులతో కలిసి బండ్ల గణేష్ బెదిరించినట్లు తెలుస్తోంది.


First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>