Bandi sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్ష ఆ పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది. మరోవైపు పార్టీ కార్యకర్తలను నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్ష పార్టీ కార్యాలయంలో కొనసాగుతోంది. ఈ దీక్షలో బండి సంజయ్ పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తోపాటు ఇతర నాయకులు పాల్గోన్నారు. మరోవైపు ఆ దీక్షకు వస్తున్న పార్టీ కార్యకర్తలను, నాయకుల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే దీక్షకు వస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.. దీంతోపాటు జగిత్యాలలో బీజేపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 15 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
కాగా నిరుద్యోగ దీక్షను ముందుగా ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేయాలని నిర్ణయించారు. ఐతే పోలీసులు అనుమతి నిరాకరించడంతో వేదికను పార్టీ ఆఫీస్ కు మార్చారు. నిరుద్యోగ దీక్షకు భయపడే సర్కార్ ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందన్నారు బండి సంజయ్ . బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని కోరారు ఆ పార్టీ నేతలు.
Breaking: ఖమ్మం జిల్లాలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి
దీక్షకు జిల్లాల నుంచి తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ నేతలు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారుఎంపీ బండి సంజయ్. కరోనా రూల్స్ కు లోబడి పార్టీ ఆఫీస్ లో దీక్ష చేస్తుంటే అభ్యంతరం ఏంటో చెప్పాలన్నారు. దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శమన్నారు సంజయ్. ఉద్యోగ, ఉపాధి కరువై లక్షల మంది యువతీ, యువకులు అల్లాడుతున్నా ప్రభుత్వం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
మరోవైపు జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారో చెప్పకుండా మంత్రి కేటీఆర్ బండి సంజయ్ పై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బహిరంగ లేఖ పేరుతో నిరుద్యోగ దీక్షపై కేటీఆర్ చేసిన విమర్శలు నిరుద్యోగులను అవమానించడమేనని విమర్శించారు. ఏడేళ్లుగా ఉద్యోగాలంటూ ఊరిస్తుండడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇప్పటివరకు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు రాజాసింగ్.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.