Home /News /telangana /

BANDI SANJAY WARNS CM KCR ON HIS ARREST BY TWITTER VRY

Bandi sanjay : మళ్లీ వస్తా... నీ భరతం పడతా.. గుర్తుపెట్టుకో కేసీఆర్..! బండి సంజయ్ హెచ్చరిక..

Karimnagar, Bandi sanjay telangana, letet news, telugu news, news, bandi sanjy arrest , బండి సంజయ్ అరెస్ట్, కరీంనగర్, తెలంగాణ, బీజేపీ, తెలంగాణ, లెటెస్ట్ న్యూస్,బెయిల్, కోర్టు

Karimnagar, Bandi sanjay telangana, letet news, telugu news, news, bandi sanjy arrest , బండి సంజయ్ అరెస్ట్, కరీంనగర్, తెలంగాణ, బీజేపీ, తెలంగాణ, లెటెస్ట్ న్యూస్,బెయిల్, కోర్టు

Bandi sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తన అరెస్ట్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.. తన అరెస్ట్ సీఎం కేసిఆర్‌కు రాజకీయ సమాధి అని గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు.

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్, రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ని జైలుకు తరలించిన తర్వాత ఆయన తీవ్రంగా సీఎం కేసిఆర్‌పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు. సీఎం కేసిఆర్‌కు ఇక రాజకీయ సమాదే అంటూ హెచ్చరించారు.మళ్లి తిరిగి వస్తా.. నీ భరతం పడతా, ప్రజల గొంతుకనై నినదిస్తా అంటూ ట్వీట్ చేశారు.

    నిర్బంధాలు,అరెస్టులు ప్రజల మధ్య సంబంధాన్ని తెంపలేవు.నీ ఆరాచక పాలనలో నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తావా ?నీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని గుర్తుంచుకో.ప్రజల తరుపున ప్రశ్నిస్తే,ప్రశ్నించే గొంతును నీ అధికార మదంతో మూయించాలని చూస్తున్నావు అంటూ పేర్కొన్నారు.

    బండి సంజయ్‌కు కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే... ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు, మరోవైపు బెయిల్‌ పిటిషన్ నిరాకరించడంతో.. జైలుకు తరలించారు. కాగా ఈనెల 17వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ విధిస్తూ. కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.




    Murder : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. కొడలిని పరుగెత్తించి హత్య చేసిన మామ..


    317జీవోకు నిరసనగా బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను నిన్న రాత్రి మానకొండూర్‌ నుంచి కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు.. కరీంనగర్‌ కోర్టులో నేడు హాజరుపరిచారు. కాగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సంజయ్‌పై కేసు నమోదు చేశారు.

    బండి సంజయ్‌ తరఫున బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన భాజపా లీగల్‌ సెల్‌.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీసీ 353 సెక్షన్‌పై లీగల్‌ సెల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో బండి సంజయ్‌పై నమోదైన కేసులను పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయనపై నమోదైన 10 కేసులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. బండి సంజయ్‌పై మొత్తంగా 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా బండి సంజయ్‌ సహా ఐదుగురికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు తీర్పు అనంతరం వారిని కరీంనగర్‌ జైలుకు తరలించారు. బెయిల్‌ కోసం బండి సంజయ్‌ జిల్లా కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అయితే జైలులో బండి సంజయ్‌కి అందించే ఆహారాన్ని జైలర్‌ రుచి చూశాకే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

    Family Suicide : ముగ్గురు సజీవదహానం, ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం.. పరారీలో నిందితుడు


    బండి సంజయ్ అరెస్ట్ , ఆ తర్వాత పరిణామాలు టెన్షన్‌ను క్రియెట్ చేశాయి..... ఆయన అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఉద్రిక్తలు రేకెత్తిస్తున్నాయి.. ఇప్పటికే ఆయన అరెస్ట్‌కు నిరసనగా ఆపార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళలనకు పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసు ట్రైనింగ్ సెంటర్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుండడంతో వారిని అరెస్ట్ చేశారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్‌లో 70 మందికి నోటిసులు ఇచ్చామని .. కార్యకర్తల దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారని అంతకు ముందు కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు.

    మరోవైపు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్తకంఠంతో ఖండించారు. ఆయన అరెస్ట్‌పై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, Telangana bjp

    తదుపరి వార్తలు