Home /News /telangana /

BANDI SANJAY TOOK KEY DECISION FOR SETTING INTERNAL POLITICS IN KARIMNAGAR VRY KNR

Karimnagar : పార్టీలో అసమ్మతి సెగకు ఫుల్‌స్టాప్ పెట్టిన ఆ పార్టీ అధినేత.. ఇప్పటికైనా సర్దుకుంటుందా.. ?

Bandi-Sanjay-Kumar

Bandi-Sanjay-Kumar

Karimnagar : కరీంనగర్ బీజేపీలో అసమ్మతి సెగలను చల్లార్చేందుకు ఆ పార్టీ అధినేత పావులు కదిపారు.. పార్టీలో అసమ్మతి సెగలు రేగకుండా తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి పాత, కొత్త నేతలతో కలిపి ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

    ( కరీంనగర్ జిల్లా.న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.)

    కరీంనగర్ బీజేపీ పార్టీ లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెద్దు పోకడతో జిల్లాలో లో ఉన్న బీజేపీని నాయకులను పట్టించుకోవడంలేదని బిజెపి శ్రేణులు వాపోతున్నారు.దీనికి సంబంధించి కూడా జిల్లా నాయకత్వం అంత కలిసి ఒక మీటింగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతుంది. అయితే ఇవన్నీ పుకార్లను కొట్టిపారేసిన బండి సంజయ్ తాజాగా నిన్న ప్రకటించిన పదవులలో జిల్లా నుండి ఇద్దరికీ పదవులు దక్కడం విశేషం..

    వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా కమలం పార్టీని అధికారంలోకి తీసుకొ చ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు . ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు . ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టారు . ఎస్సీ , ఎస్టీ నియోజకవర్గాల్లో చేరికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు . ఇందుకు ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేశారు . జాయినింగ్స్ అండ్ కో - ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఇంద్రసేనారెడ్డిని , ఎస్సీ సమన్వయ కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డిని , ఎస్టీ కమిటీకి చైర్మన్ గా మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావును రాష్ట్ర అధిష్టానం నియమించింది . వీరితో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇద్దరు బిజెపి  నేతలకు పదవులు ఇస్తున్నట్లి అధిష్టానం ఆదేశాలిచ్చింది .

    Peddapally : చెల్లెలు చనిపోయి నాలుగు రోజులు గడిచినా.. బయటికి చెప్పని అక్క.. దుర్వాసనతో ఇంట్లోనే..! కారణం ఇదేనా...?

    ఇతర పార్టీల్లో అసహనంతో ఉన్న ఎమ్మెల్యేలు , ఎంపీలు , మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలతో పాటు పారి శ్రామికవేత్తలు , విద్యావేత్తలు , యువకులను కమలం పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది . పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు దళిత , గిరిజన రిజర్వ్ అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలను నియమించి జోష్ పెంచింది . సీనియర్ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత కొత్త నేతల కలయికతో పార్టీని సమన్వయం చేయడమే ఈ కమిటీల ముఖ్య ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది . రెండేళ్ల పాటు ఎస్సీ , ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా సమన్వయ కమిటీలు పర్యటిస్తూ బీజేపీ కార్య క్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు .

    Cabinet decision : ఆ కాలేజీలో చదువుకుంటే నేరుగా ఉద్యోగాలే.. మరో రెండు యూనివర్శిటిలకు కసరత్తు

    బూత్ స్థాయి మొదలు గ్రామ , మండల , నియోజక వర్గ స్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ? నేతల పనితీరుతోపాటు వారి మధ్య సమన్వయం ఎలా ఉంది ? అనే అంశాలపై అధ్యయనం చేస్తాయి . అట్లాగే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి , పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కార్యాచరణను రూపొందించి రాష్ట్ర నాయకత్వానికి అందజే యనున్నాయి .
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, Karimnagar, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు