పీఎం మోదీ రాష్ట్ర పర్యటన మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. హైదారాబాద్‌కు చేరుకున్న మోదీని ఆహ్వానించేందుకు సీఎం రాకపోవడంపై రాజకీయ చర్చకు దారీ తీసింది. షెడ్యుల్ ప్రకారం సీఎం మోదీ వెంట వెళ్లాల్సి ఉన్నా.. జ్వరం రావడంతో చివరి క్షణంలో దాన్ని రద్దు చేసుకున్నారు. పీఎం మోదీ రాష్ట్ర పర్యటన మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. హైదారాబాద్‌కు చేరుకున్న మోదీని ఆహ్వానించేందుకు సీఎం రాకపోవడంపై రాజకీయ చర్చకు దారీ తీసింది. షెడ్యుల్ ప్రకారం సీఎం మోదీ వెంట వెళ్లాల్సి ఉన్నా.. జ్వరం రావడంతో చివరి క్షణంలో దాన్ని రద్దు చేసుకున్నారు.
దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ సంస్కృతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివానన్న సీఎం జ్ఝానం ఏమైపోయిందని మండిపడ్డారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందంటూ ప్రశ్నించారు. సీఎం కోరినప్పుడల్లా
ప్రధాని అపాయిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ మండిపడ్డారు.
రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్ కే పరిమితమవుతారా అంటూ ధ్వజమెత్తారు. కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గన్పించడం లేదా?నీ భాషను చూసి దేశమంతా అసహ్యించుకుంటుంటే ప్రధానికి ముఖం చూపించలేక తప్పించుకున్నావా?
మీలాంటి సంస్కార హీనుడు, మూర్ఖుడు, అహంకారి రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం సిగ్గు చేటు
రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తారు.... ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానిస్తారు... మీ సంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
మీ భాష, మీ సంస్కారం చూసి తెలంగాణ సభ్య సమాజం ఛీదరించుకుంటోంది, మీలాంటి మూర్ఖుడు సీఎంగా కొనసాగడం సిగ్గు చేటు.అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Pm modi