వ్యక్తుల కోసం జీఓలు జారీ చేయడమేంటి?.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

ఉద్యోగ సంఘాల నాయకులు..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ లెక్చరర్లు, ఎక్సైజ్ సీఐల ఉద్యోగ కాలం పొడగింపు జీఓలు జారీ చేయడమేంటని ప్రశ్నించారు.

  • Share this:
    కొంతమంది వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓలు జారీ చేయడం దుర్మార్గమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇది ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమి, మద్యం దుకాణం కోసం కూడా ప్రత్యేక జీఓలు జారీ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ లెక్చరర్లు, ఎక్సైజ్ సీఐల ఉద్యోగ కాలం పొడగింపు జీఓలు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. బయటకు తెలిసిన జీఓలు కొన్ని అయితే.. రహస్యంగా జారీ చేసిన జీఓలకు లెక్కేలేదని, జారీ చేయాలనుకుంటున్న జీఓలకు అంతులేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేస్తోన్న ఈ మోసంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పునరాలోచించుకోవాలని సూచించారు.

    రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వైద్యులకు కరోనా సోకిందని, బీజేపీ ఎంత చెప్పినా.. వైద్యులకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు పంపిణీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. వైద్యులను కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్యులను ఏం కాపాడుతుందంటూ మండిపడ్డారు. మీకు చేతగాకపోతే చెప్పండి.. కోవిడ్ ఆస్పత్రుల్లోని వైద్యులను మేం కాపాడుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని మండిపడ్డారు.
    Published by:Narsimha Badhini
    First published: