BANDI SANJAY LUNCH MOTION PITITION REJECTED BY HIGH COURT VRY
Bandi Sanjay : బండి సంజయ్‌కు మరోషాక్, బెయిల్ పిటిషన్ విచారణ మరో బెంచ్‌కు
bandi sanjay
Bandi Sanjay : హైకోర్టులో కూడా బండి సంజయ్‌కు ఎదురుదెబ్బ తగిలింది..ఆయనపై ఉన్న కేసులను కొట్టివేయాలని దాఖలు చేసిన లంచ్మోషనన్ పిటిషన్‌ను కోర్టు విచారణకు తిరస్కరించింది.
బండి సంజయ్ అరెస్ట్ తర్వాత బెయిల్ పిటిషన్ పిటిషన్ స్థానిక కోర్టు తిరస్కరించడంతో ఆయన నేడు తనపై పెట్టిన కేసులను కొట్టి వేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు తనపై కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఆయన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పిటిషన్‌ను తిరస్కరించింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే సంబంధిత కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
బండి సంజయ్ అరెస్ట్ , ఆ తర్వాత పరిణామాలు టెన్షన్‌ను క్రియెట్ చేశాయి..... ఆయన అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఉద్రిక్తతలు రేకెత్తిస్తున్నాయి.. ఇప్పటికే ఆయన అరెస్ట్‌కు నిరసనగా ఆపార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళలనకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా సికింద్రబాద్‌లోని గాంధీ విగ్రహం నుండి ప్యారడైజ్ సర్కిల్ వరకు క్యాండిల్ ర్యాలీలను బీజేపీ చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నట్టు బీజేపీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు ఈ ర్యాలీ కొనసాగనుంది. అయితే కరోనా నేపథ్యంలోనే మూడు రోజుల పాటు ర్యాలీలు, ఆందోళనలను లేవని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా పాల్గోననున్న శాంతి ర్యాలీకి అనుమతులపై క్లారీటి ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆయన పాల్గొనబోయో శాంతి ర్యాలీకి సైతం అనుమతులు లేవని నార్త్‌జోన్ డీసిపి చందనా దీప్తీ స్పష్టం చేశారు. ఇందుకోసం పోలీసులు ఆయన ర్యాలీలో పాల్గొనకుండా శంషాబాద్‌కు చేరుకుని నోటీసులు అందించనున్నారు. అనుమతి లేని ర్యాలీలో పాల్గొనవద్దని ప్రయత్నాలు చేయనున్నారు..
దీంతో బీజేపి చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ ఎలా కొనసాగుతుందనే ఉత్కంఠ రేగుతోంది. మరోవైపు నిషేధం ఉన్నా ర్యాలీ కొనసాగిస్తామని రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర నేతల ప్రకటనల ప్రకారం వారు ర్యాలీని చేస్తారునుకున్నా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పోలీసులు అనుమతి ఇవ్వని ర్యాలీలో పాల్గొంటారా అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ పాల్గొంటే పోలీసులు ఎలాంటీ చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. వాస్తవానికి మూడు రోజుల పాటు జరిగే ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో పాల్గొందుకు ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆనంతంరం క్యాండిల్ ర్యాలీలో పాల్గొనున్నట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.