హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ రైడ్స్ పై బండి సంజయ్, లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..

Telangana: మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ రైడ్స్ పై బండి సంజయ్, లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..

బండి సంజయ్, లక్ష్మణ్

బండి సంజయ్, లక్ష్మణ్

తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారుల రైడ్స్ టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి. మొన్న గంగుల కమలాకర్, నిన్న మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో సోదాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఏకంగా 48 గంటల పాటు 50 బృందాలు మల్లారెడ్డి టార్గెట్ గా ఆయన నివాసాల్లో, బంధువుల ఇళ్లలో విస్తృత తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ.10 కోట్లు దొరికినట్లు తెలుస్తుంది. కాగా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్డంగా సంపాదించి దాస్తే దాడులు చేస్తారని, తప్పు చేయనప్పుడు భయమెందుకని వారు మండిపడ్డారు. ఫిర్యాదులు అందితే సోదాలు చేయకూడదా అని వారు మండిపడ్డారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    తెలంగాణలో ఈడీ (Enforcement Directorate), ఐటీ (Income Tax) అధికారుల రైడ్స్ టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి. మొన్న గంగుల కమలాకర్ (Gangula Kamalakar), నిన్న మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నివాసాల్లో సోదాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఏకంగా 48 గంటల పాటు 50 బృందాలు మల్లారెడ్డి టార్గెట్ గా ఆయన నివాసాల్లో, బంధువుల ఇళ్లలో విస్తృత తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ.10 కోట్లు దొరికినట్లు తెలుస్తుంది. కాగా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay), బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్డంగా సంపాదించి దాస్తే దాడులు చేస్తారని, తప్పు చేయనప్పుడు భయమెందుకని వారు మండిపడ్డారు. ఫిర్యాదులు అందితే సోదాలు చేయకూడదా అని వారు మండిపడ్డారు.

    తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పెరగనున్న గ్రూప్-2, 3, 4 ఖాళీలు.. జీవో విడుదల చేసిన సర్కార్

    బండి సంజయ్ ఫైర్..

    ప్రజల సొమ్ము దాచుకున్న వారిని మోడీ విడిచిపెట్టడని బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. అడ్డగోలుగా సంపాదించిన వారిపై తనిఖీలు చేయొద్దా అని ప్రశ్నించారు. అధికారులకు పార్టీలకు సంబంధం ఉండదు. ఈ మాత్రం తెలియకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. తప్పులు చేయనప్పుడు రైడ్స్ ను ఎదర్కొని సమాధానం చెప్పాలని, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని మండిపడ్డారు. పేదలను దోచుకొని కూడబెట్టిన సొమ్ముపై ఫిర్యాదులు అందితే అధికారులు దానిపై స్పందిస్తారని రైడ్స్ చేస్తారని అన్నారు. కానీ న్యాయ నిపుణులతో ఎదురుదాడిపై స్పందించేందుకు కేసీఆర్ (Cm Kcr) చూడడం సరికాదన్నారు.

    తప్పు చేయనప్పుడు భయమెందుకన్న లక్ష్మణ్..

    తప్పు చేయనప్పుడు భయమెందుకని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఐటీ రైడ్స్ జరుగుతున్నాయనే విషయాన్ని టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొలేకే టీఆర్.ఎస్ కక్ష్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారన్నారు. BL సంతోష్ ను కక్షతోనే ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. మేము రాజకీయంగా, న్యాయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడకు జీవనోపాధికి వచ్చిన వారిని బీసీ జాబితా నుండి తొలగించింది. తూర్పు కాపు, కొప్పుల వెలమ సహా 26 కులాలను తొలగించింది. బీజేపీ అధికారంలోకి రాగానే వారిని బీసీ జాబితాలో చేర్చుతాం. అప్పటివరకు బీజేపీ పోరాటం ఆగదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాగా నిన్న, మొన్న టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ రైడ్స్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నాయకులూ ఇలా స్పందించారు.

    Published by:Rajashekar Konda
    First published:

    Tags: Bandi sanjay, Bjp, Mallareddy, Telangana, Trs

    ఉత్తమ కథలు