Home /News /telangana /

BANDI SANJAY HAS WRITTEN A LETTER TO CM KCR TO FULFILL THE PROMISES GIVEN TO WOMEN IN TELANGANA ON THE OCCASION OF RAKHI FESTIVAL PRV

Rakhi festival |Bandi sanjay: రాఖీ పండుగ రోజైనా మహిళలకు ఆ వరం ఇవ్వు.. సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ సూచన

కేసీఆర్, బండి సంజయ్(ఫైల్ ఫోటో)

కేసీఆర్, బండి సంజయ్(ఫైల్ ఫోటో)

ఈనెల 11, 12 వతేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా మహిళలు రాఖీ పండుగ జరుపుకొంటున్నారు. ఈసందర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్​ సీఎం కేసీఆర్​కు ఓ డిమాండ్​ చేశారు. ఆయన ఇచ్చిన వరాల్లో కొన్నింటిని ఈ రోజు ఇవ్వమన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    డ్వాక్రా (DWCRA) సంఘాల్లోని మహిళలకు కేటాయించిన నిధులను రాఖీ పౌర్ణమి (Rakhi festival) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (BJP President Bandi sanjay) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ (Open letter) రాశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌), పట్టణపేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా), మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. తెరాస (TRS) ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని బండి విమర్శించారు.

    ‘‘తెరాస ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా (Dwcra) గ్రూపులను నిర్వీర్యం చేశారు. 2021-22 బడ్జెట్‌లో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ.3వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదు. ఆ తర్వాత 2022-23 బడ్జెట్‌లో రూ.1,250 కోట్లు కేటాయించినా.. ఆ నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందనే ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ నిధులు విడుదల చేయాలి’’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో సంజయ్‌ పేర్కొన్నారు.



    వాళ్లతో రాజీనామా చేయించు..

    కాగా, అంతకుముందు రోజు బండి సంజయ్​ కేసీఆర్​పై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యముంటే TRSలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. 9వ రోజు ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా ఆయన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చేరు కున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘మీరు రాముడి వారసులైతే బీజేపీకీ ఓటేయాలి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు అధికా రం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి’ అని కోరారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కేసీఆర్‌ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 200 కి.మీ. దూరంలో ఉన్న తన ఫాంహౌస్‌ నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేసీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కనీసం రూ.700 కోట్లు వెచ్చించలేకపోతున్నారని విమర్శించారు. నిధుల్లేకనే ధర్మారెడ్డిపల్లె, బునాదిగాని, పిలాయిపల్లి కాలువలు పూర్తి కావడంలేదని అన్నారు.

    కేసీఆర్‌కు వయసు మీదపడి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రామన్నపేటలో రైళ్లు నిలిచేవిధంగా కేంద్రంతో మాట్లాడతానని ఆయన స్థానికులకు హామీనిచ్చారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయని అన్నారు. సంజయ్‌ 9వ రోజు 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, CM KCR, Rakhi purnima 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు