Bandi sanjay : అసెంబ్లీకి RRR .. టీఆర్ఎస్.. ఓడిపోతే.. సీఎం రాజీనామా చేస్తాడా.. ?

బండి సంజయ్(ఫైల్ ఫొటో)

Bandi sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సీఎం కేసిఆర్‌ను చెప్పమనండి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..

  • Share this:
    హుజూరాబాద్‌లో (Huzurabad ) నిర్వహించిన ఎన్నికల సమర శంఖరావం కార్యక్రమంలో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay ) పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ( trs ) పార్టీ గెలుస్తుందని సీఎం కేసీఆర్‌కు ( cm kcr ) కూడా నమ్మకం లేదని అన్నారు. ఒకవేళ ఆయనకు నమ్మకం ఉంటే.. ఒకవేళ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో గెలవలేకనే ఆయన ఇంచార్జిగా మంత్రి హరీష్ రావును( harish rao ) నియమించారని చెప్పారు. ఒకవేళ హుజూరాబాద్‌లో గెలిచే పరిస్థితి గనుక ఉంటే.. మంత్రి కేటీఆర్‌ను (ktr ) ఇంచార్జ్‌గా నియమించేవాడని అన్నారు.

    ఈ క్రమంలోనే ప్రతి ఓటుకు పదివేల ( 10000) రూపాయలను ఇప్పటికే పంచడానికి సిద్దంగా ఉన్నారని అన్నాడు.. ఇక ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. మరోవైపు దళిత బంధు ( Dalita bhandu ) పేరుతో వారి ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేసి అకౌంట్‌లను ( bank acconts ) ఫ్రీజ్ చేశారని అన్నారు. వ్యక్తుల ఖాతాలను ఫ్రీజ్ చేసే అధికారం ఆర్బీఐతో ( RBI )పాటు ఈడీ లాంటీ సంస్థలకు తప్ప బ్యాంకు అధికారులకు కూడా లేదని అన్నారు. ఈ క్రమంలోనే దళిత బంధు పథకంలో పడ్డాయని వాటిని వెంటనే విడుదల చేయకపోతే బీజేపీ ( BJP ) పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.

    ఇది చదవండి : తెలంగాణలో  ప్రజా ప్రస్థానం పేరుతో.. షర్మిల పాదయాత్ర


    ఇది చదవండి :సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు అత్త,మామా, చివరికి భ...ర్తలా కూడా..?


    సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఆయన పార్టీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తిరిగి ఈటల రాజేందర్ ( Eetala rajender ) ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ వెళ్లడం ఖాయమని చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీలో ఉన్న రాజాసింగ్, రఘునందన్‌రావుకు తోడుగా రాజేందర్ కూడా చేరడం ఖాయమని అన్నారు. ఈ సంధర్భంగా వారిని త్రిబుల్ ఆర్‌గా (RRR) అభివర్ణించారు. అసెంబ్లీలో కూడా మరో త్రిబుల్ రాబోతుందని అన్నారు.
    Published by:yveerash yveerash
    First published: