ఉపాధ్యాయులారా బయటకు రండి మీ నాయకత్వంలోనే ముఖ్యమంత్రి బుట్లు నాకే వారు ఉన్నారు. అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామి ఇచ్చారు. 317 జీవో రద్దు అయ్యేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. అయినా ప్రభుత్వం దిగి రాకపోతే రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారం రావడం ఖాయమని, అప్పుడు ఉపాధ్యాయులకు తాము కొరుకుంటున్నట్టుగా పోస్టింగ్లు ఉంటాయని ఆయన చెప్పారు.
కేసీఆర్కు నష్టమేమిటీ..?
ప్రశాంత వాతవరణంలో నేను దీక్ష చేస్తుంటే కేసీఆర్కు వచ్చిన నష్టమేమిటి ఏమిటని ఆయన ప్రశ్నించాడు... అధికారాన్ని ఉపయోగించి బీజేపీ కుటుంబ సభ్యులను గాయాల పాలు చేశాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు కూడా ఆయన కుటుంబ సభ్యులు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లో వారికి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.. మరోవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు...బీజేపీ చేపట్టే ధర్మ యుద్దంలో ప్రజలు సహకరించాలని కోరారు.
ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ కేసులో సీఎం కేసీఆర్ కనీసం స్పందించకుండా ఉన్నాడంటే వారికి పూర్తిగా సపోర్టు చేస్తున్నావని అర్థం చేసుకుంటామని చెప్పారు. ఈసంధర్భంగా రాఘవపై ఆయన నిప్పులు చెరిగారు.. రాఘవ తన నియోజకవర్గంలో ఎవరిని కూడా వదిలిపెట్టలేదని, చివరకు పోలీసుల కుటుంబ సభ్యులను కూడా ఇదే తరహాలో ట్రీట్ చేశాడని అన్నాడు. అయినా ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఉందని దుయ్యబట్టారు.
కాగా జైలు నుండి విడుదలైన తర్వాత రెండు రోజుల పాటు కరీంనగర్లోనే ఉన్న బండి సంజయ్ నేడు హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సంధర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయన్ను నగర శివారు నుండి ఘనస్వాగతం పలికారు. భారీ ఎత్తున కార్యకర్తలు ,నాయకులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ద్వారా ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోని ప్రసంగించారు. కాగా సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గోన్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఖరిపై నిప్పులు చెరిగారు. బీజేపీని అడ్డుకునే శక్కి సీఎం కేసీఆర్కు లేదని అన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బంధీ అయిందని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.