Home /News /telangana /

BANDI SANJAY FIRES ON CM KCR ON THE OCCASION OF THE LASHKAR BONALU VRY

Bandi Sanjay : గ్రామ దేవతలు పవర్‌ఫుల్.. సీఎం కేసిఆర్‌కు తగిన శాస్తి జరుగుతుంది..!

Bandi Sanjay : గ్రామ దేవతలు పవర్‌ఫుల్..

Bandi Sanjay : గ్రామ దేవతలు పవర్‌ఫుల్..

Bandi Sanjay : తెలంగాణ గ్రామ దేవతలు చాలా పవర్‌ఫుల్ ...అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అయితే ఇలాంటీ పవర్ ఫుల్ దేవతలు ప్రజలను మోసం చేస్తున్న వారిని చూస్తూ ఊరుకోరని అన్నారు.లష్కర్ బోనాల సంధర్బంగా ఆయన పలు దేవాలయాను దర్శించుకున్నారు.

ఇంకా చదవండి ...
    సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు భారి ఎత్తున క్యూలు కట్టారు. మరోవైపు నగరంలో ప్రముఖుల తాకిడి సైతం సికింద్రాబాద్ మహాంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సికింద్రాబాద్ తోపాటు రెజిమెంటల్ బజార్ లోని గండిమైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

    అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.మౌజమ్ లకు, చర్చీల్లో ఫాదర్ లకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్న సీఎం కేసిఆర్ . తెలంగాణలో ప్రతి గ్రామంలో మహంకాళమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాల్లో వారికి కూడా జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా ఈ గుళ్లకు పూజారులుగా బడుగు బలహీన వర్గాలవారే ఎక్కువగా ఉంటారని అన్నారు. హిందూ గ్రామ దేవత పూజారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిని వెంటనే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి కూడా అందరి వలే జీతాలు ఇవ్వాలని కోరారు.లేదంటే వారి వేతనాల కోసం బీజేపి పోరాట బాట పడుతుందని ఆయన హెచ్చరించారు.

    ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వైఖరిపై ఆయన ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే పంటడని, ఎన్నికలు వస్తేనే తప్ప హైదరాబాద్ కు రాడని విమర్శించారు... ఇక హైదరాబాద్ కు వచ్చిన వెంటనే  ఫెకుడు షురూ చేస్తాడని దుయ్యబట్టారు...ఓట్ల కోసం కులాలను వాడుకుంటూ ఎంతటి స్థాయికైన దిగజారుతాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు స్కీం అంటూ బహిరంగ ప్రకటనలు చేయడంపై ఆయన మండిపడ్డారు. గత కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశాడని దుయ్యబట్టారు. ఇలాంటీ వాళ్లను తెలంగాణ గ్రామ దేవతలు వదిలిపెట్టరని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసిఆర్‌కు తగిన శాస్తి జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు