Home /News /telangana /

BANDI SANJAY FIRES ON CM KCR FOR EMPLOYMENT VRY

Bandi sanjay : 50 వేల ఉద్యోగాలు ఉత్తమాటే...

బండి సంజయ్ కుమార్ (ఫైల్)

బండి సంజయ్ కుమార్ (ఫైల్)

Bandi sanjay : హుజూరాబాద్‌లో ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ ఉద్యోగాలంటూ యువతను మోసం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో సైతం 50 వేల ఉద్యోగాలు అంటూ సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికాడని ఆయన విమర్శించారు.

ఇంకా చదవండి ...
    ఉద్యోగాల పేరుతో సీఎం కేసిఆర్ మరోసారి మోసానికి తెరలేపారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగాలు వస్తాయనుకున్న యువతకు కమల్‌నాథన్ కమీషన్‌ పేరుతో కాలాయాపన చేశారని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రాష్ట్రాంలో ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని అన్నారు.అయినా సీఎం కేసిఆర్ కు నిరుద్యోగులపై కనీసం చిత్తశుద్ది లేదని విమర్శించారు.ఉద్యోగాలు భర్తి చేసేందుకు టైం ఫ్రేం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఇక ఉద్యోగ ఖాలీలపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు.

    ఇక హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఉద్యోగాలని అంటున్నాడని..ఇక వాటిని కూడా కొత్తగా జిల్లా, జోన్లు, మల్టీజోన్లు, స్టేట్ బేసిస్ లో కొలువుల భర్తీ అంటూ తేనెతుట్టెను కదిపారని అన్నారు. దీంతో అవి భర్తి అయ్యోందుకు కాలయాపన చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.ఇలా ఎన్నికలు వచ్చాయంటే యువతను మభ్యపెట్టడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు.ఇలా గత ఎన్నికల్లో ప్రకటనలు చేశారని,కాని ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదని అన్నారు. ఉద్యోగ ఖాలీలతో జిల్లాలో అభివృద్ది కుంటుపడడంతో పాటు పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.నిరుద్యోగ ఖాలీలతో అనేక చోట్ల ఇంచార్జులతో నెట్టుకువస్తున్నారని దీని వల్ల ఉద్యోగులపై పని భారం ఎక్కువైందని చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, CM KCR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు