తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర (Praja Sangraama Padayatra) రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్ర ప్రారంభం ముందు నిర్వహించే సభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) పాల్గొననున్నారు. ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుండి కరీంనగర్ వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
భైంసా నుండి కరీంనగర్ వరకు...
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ నవంబర్ 28న ప్రారంభం....#BandiSanjayPadaYatra#Prajasangramayatra5 pic.twitter.com/LVJsscbti6 — Neeli Madhu MN (@MN4BJP) November 27, 2022
రేపు ఉదయం నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమ్మ అమ్మవారి కార్యాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత బైంసాకు వెళ్లి పాదయాత్ర ప్రారంభించనున్నారు. రేపు 6.4 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం గుండగామ్ లో బండి సంజయ్ బస చేయనున్నారు. 29న గుండగామ్ నుండి మహాగన్, చటా మీదుగా లింబా వరకు కొనసాగనుంది. ఇక 3వ రోజు లింబా నుండి ప్రారంభమై కుంటాల, అమ్బకంటి మీదుగా బూజురుగుకు చేరుకోనుంది. ఈ మూడు రోజులు కూడా ముథోల్ అసెంబ్లీ నియోజవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది.
డిసెంబర్ 1 నుండి 6 వరకు నిర్మల్ అసెంబ్లీ నియోగాజవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 2న రాంపూర్ నుండి లోలం మీదుగా చిట్యాల వరకు 3న చిట్యాల నుండి మంజులపూర్, నిర్మల్ రోడ్, ఎడిగం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తపూర్ వరకు కొనసాగనుంది. 4న లక్ష్మణ్ చందా మండలంలో 5న మమ్డా మండలంలో, 6,7న ఖానాపూర్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలో 21.7 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం మీదుగా వేములవాడ నియోజకవర్గానికి చేరుకోనుంది.డిసెంబర్ 11న మేడిపల్లి, తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ వరకు యాత్ర సాగనుంది.
డిసెంబర్ 12న జగిత్యాల పట్టణం, డిసెంబర్ 13న చొప్పదండి నియోజకవర్గం నుండి కొండగట్టుకు చేరుకోనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా..డిసెంబర్ 16,17న కరీంనగర్ లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Telangana, Telangana bjp, Telangana News