సీఎం కేసిఆర్ రైస్ మిల్లర్ల కోసమే ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇక కేసిఆర్ దీక్ష చేయడానికి పీఎం మోదీ రైతు చట్టాలు రద్దు చేయడానికి ఎలాంటి సబందం లేదని అన్నారు. మరోవైపు సీఎం ధర్నా చేసింది పంజాబ్ రైతుల కోసమా లేక రాష్ట్ర రైతుల కోసమా అని ఆయన ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసాకి సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. వానాకాలం కొనుగోళ్లు చేయడానికే చేతగాని సీఎం కేసిఆర్ ఎండాకాలం పంటగురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. యాసంగి పంటలకు సంబంధించి ఫిబ్రవరి మాట్లాడాల్సిన సీఎం కేసిఆర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం కు చిత్తశుద్ది ఉంటే వెంటనే వానకాలం పంటలను కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నేడు అంతమంది అధికారులను తీసుకువెళ్లకుండా వారినే ధాన్యం కొనుగోలుపై దృష్టిపెడితే.. కోనుగోళ్లు సజావుగా కొనసాగేవని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయమని ఎవరు చెప్పలేదని అయన స్పష్టం చేశారు.
ఇక పీఎంను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న సీఎం కేసిఆర్ ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలపై ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు నేడు మధ్యాహ్నం సీఎం కేసిఆర్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలోనే పూర్తి స్థాయి అంశాలను తేల్చుకుని వస్తామని చెప్పారు. ఇందుకోసం రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని చెప్పారు. దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వరి ధాన్యం కోనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ఇది చదవండి : సెలవు ఇవ్వలేదని ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR