హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi sanjay : ఎలా.. ధాన్యం కోనుగోలు కేంద్రాలు మూస్తారో... మేము చూస్తాం...!

Bandi sanjay : ఎలా.. ధాన్యం కోనుగోలు కేంద్రాలు మూస్తారో... మేము చూస్తాం...!

Bandi-Sanjay-Kumar

Bandi-Sanjay-Kumar

Bandi sanjay : యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించిన సీఎం కేసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కౌంటర్ అటాక్ చేశారు. ( Bandi sanjay counter attack to cm kcr ) ధాన్యం ఎలా కొనుగోలు చేయరో చూస్తామంటూ హెచ్చరించారు.

ఇంకా చదవండి ...

  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎలా మూసి వేస్తారో చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేడు ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ( Bandi sanjay counter attack to cm kcr ) ఈ సంధర్భంలోనే సీఎం కేసిఆర్ సోమవారం కేబినెట్ సమావేశం తర్వాత కేంద్రం పై విరుచుకుపడడంతో దానికి కౌంటర్‌ గా ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. సీఎం కేసిఆర్ మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు..

  సీఎం పదవిలో ఉన్న కేసిఆర్ బాషా ప్రజలు ఈసడించేదిగా ఉందని దుయ్యబట్టారు. ( Bandi sanjay counter attack to cm kcr )క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి.. మంత్రులకు ఎలా తిట్టాలో చర్చించారా అని ఎద్దెవా చేశారు. సీఎం స్థాయి దిగజారీ మంత్రి కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారని అన్నారు.ఢిల్లీ (Delhi ) వెళ్లి వచ్చాక కేసీఆర్ కు పిచ్చి ఇంకా ముదిరిందని చెప్పారు. ఓ వైపు కేంద్రం రా రైస్ కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ( Bandi sanjay counter attack to cm kcr )రైతుల నుండి ధాన్యాన్నే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఫోజులు కొట్టారని కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు.

  V.C Sajjanar : బస్సులో డాన్స్ చేసిన సజ్జనార్.. కుటుంబ సభ్యులతో కలిసి టూర్


  మరి ఇప్పుడు ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు..ఇక రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యాసంగిలో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలుచేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకుండా చేయాలని కేసీఆర్ చాలా కాలంగా కుట్రలు పన్నారన్నారు. ( Bandi sanjay counter attack to cm kcr )గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి 7500 కోట్లు నష్టం రావడంతో ఈ కుట్రకు తెర లేపారని అన్నారు. ధాన్యం కొనుగోలుపై ఇతర రాష్ట్రాలకు రాని సమస్య తెలంగాణకే ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు.

  Nalgonda :అప్పులు ఇలా కూడా వసూలు చేసుకోవచ్చు..! మద్యం వ్యాపారికి వర్కవుట్ అయిన బ్యానర్ ఐడియా.. బాకిలు ఇస్తామంటూ క్యూ


  బాయిల్డ్ రైస్ వినియోగంపై ఆయన వివరించారు. గతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రంలో తినేవారు అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో తినడం లేదన్నారు. తినని వాళ్లను బలవంతంగా తినిపిస్తారా అని ప్రశ్నించారు. మెడపై కత్తిపెట్టి కోనుగోలుపై రాయించుకున్నారని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.. ఎవరైనా మెడపై కత్తి పెడితే ఏమైనా రాసి ఇస్తావా అంటూ ప్రశ్నించారు.( Bandi sanjay counter attack to cm kcr ) అలాంటప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈ విషయమై ఎందుకు ప్రశ్నించలేదు. మోడీని కలిసిన సమయంలో ఎందుకు ఈ విషయమై ఎందుకు చెప్పలేదన్నారు. మెడపై కత్తి పెడితే ఫామ్ హౌస్ రాసిస్తావా అంటూ సెటైర్లు వేశారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Bandi sanjay, CM KCR

  ఉత్తమ కథలు