సీఎం కేసీఆర్ (KCR)పై బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలస్యం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ వద్దన్న సీఎం కేసీఆర్.. అదే ధర్నా చౌక్‌లో కూర్చొన్నారని అన్నారు. కేసీఆర్ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా? పంజాబ్ (Punjab) రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష చేయడానికి, ప్రధాని మోదీ సాగుచట్టాలు రద్దు చేయడానికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ (BJP) చాలా విజయాలు సాధించిందన్ని అన్నారు. ఎప్పుడు ఫాం హౌస్‌లో ఉండే కేసీఆర్‌ను బయటకు రప్పించామన్నారు.
40 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పిం దా? లేదా? అని బండి సంజయ్ అన్నారు. రైతుల ఆత్మ హత్య ల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉం దని, రాష్ట్రం లో ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుం బాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వా లని బం డి సం జయ్ డిమాం డ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. వానాకాలం కొనుగోళ్లు చేయడానికే చేతగాని సీఎం కేసిఆర్ ఎండాకాలం పంటగురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. యాసంగి పంటలకు సంబంధించి ఫిబ్రవరి మాట్లాడాల్సిన సీఎం కేసిఆర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం కు చిత్తశుద్ది ఉంటే వెంటనే వానకాలం పంటలను కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక నేడు అంతమంది అధికారులను తీసుకువెళ్లకుండా వారినే ధాన్యం కొనుగోలుపై దృష్టిపెడితే.. కోనుగోళ్లు సజావుగా కొనసాగేవని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయమని ఎవరు చెప్పలేదని అయన స్పష్టం చేశారు.
రైతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
రైతు చట్టాల వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మూడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక చట్టాల రద్దుతో పాటు రైతులకు క్షమాపణ చేప్పిన ప్రధాని మోదీ వెంటనే రైతు కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రైతులకు సంఘీబావం తెలుపుతున్నట్టు సీఎం ప్రకటించారు. కేవలం చట్టాలను రద్దు చేయడమే కాకుండా రైతులపై పెట్టిన కేసులను కూడా వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోరాటంలో బాగంగా రైతులతోపాటు ఇతరుపై కూడా కేసులు పెట్టారని, అవి కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పంటలకు ఎమ్ఎస్పీ ప్రకటించే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.