BANDAY SANJAY FIRES ON CM KCR ON EMPLOYMENT ISSUE VRY
Banday sanjay : ప్రొ. జయశంకర్ ఆత్మ ఘోషిస్తోంది... మేధావులు ఆలోచించాలి..!
bandi sanjay
Banday sanjay : ఉద్యోగాల భర్తిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ కార్యాలయంలో చేపట్టిన దీక్ష విరమించారు. ఈ సంధర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు ఇవ్వక పోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని విమర్శించారు.
బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్ కు వణుకు పుట్టిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.. ఈ క్రమంలోనే బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రుహ నిర్భందం చేశారని ఆయన విమర్శించారు. కాగా సీఎం కేసిఆర్‌కు ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కోవిడ్ తో ఎందరో మరణిస్తే ఏనాడూ బయటకు రాని సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు మాత్రం కొవిడ్ నిబంధనలతో అరెస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ దీక్ష ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామనే ఉద్దేశంతోనే.. భయపడి జీవో తెచ్చిండని అన్నారు. బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్ కు వణుకు పుట్టిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.. ఈ క్రమంలోనే బీజేపీ దీక్షను భగ్నం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రుహ నిర్భందం చేశారని ఆయన విమర్శించారు. కాగా సీఎం కేసిఆర్‌కు ఇన్ని రోజులు సీఎంకు కోవిడ్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
కోవిడ్ తో ఎందరో మరణిస్తే ఏనాడూ బయటకు రాని సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు మాత్రం కొవిడ్ నిబంధనలతో అరెస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ దీక్ష ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామనే ఉద్దేశంతోనే.. భయపడి జీవో తెచ్చిండని అన్నారు.
ఇక ఎందరో మేధావులు తెలంగాణ ప్రాంతం వారికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే.... కేసీఆర్ లాంటి మూర్ఖుడి మోసపు మాటలను ఈ మేధావులు ఎందుకు అంచనా వేయలేకపోయారని అన్నారు... ఇక మేధావులను కూడా మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ దుయ్యబట్టారు.ఆరోజే మేధావులు కేసీఆర్ మోసాన్ని పసిగడితే... రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు.ఇక సీఎంకు ఉద్యోగాలు, నిరుద్యోగులు, కార్మికులపట్ల ఎందుకింత కక్ష కట్టిండో అర్ధం కావడం లేదని అన్నారు...
7 ఏళ్లుగా గ్రూప్-1 లేదని మూడేళ్లుగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా వేయలేదని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా... ఉన్న ఉద్యోగులను తొలగించారని అన్నారు.12 వేల మంది విద్యా వలంటీర్లు, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 22 వేల మంది స్కావెంజర్లను ఈ ప్రభుత్వం తొలగించారని అన్నారు..ఇక అసెంబ్లీలో 1 లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం ప్రకటిస్తే.. అదే బిశ్వాల్ కమిటీ 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు...మరోవైపు టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నరాని అన్నారు.
నిరుద్యోగ దీక్షకు వచ్చి సంఘీభావం తెలిపిన ఓయూ, కాకతీయ, హోంగార్డ్స్ అసోసియేషన్, విద్యా వలంటీర్ల, ప్రైవేటు ఉద్యోగ సంఘం నాయకులు, సోషల్ ఫోరం, జేఎన్టీయూ విద్యార్థులందరికీ బీజేపీ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు..
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.