Balapur Ganesh 2020: బాలాపూర్ వరసిద్ధి వినాయకుణ్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. కరోనా కారణంగా... ఈ సంవత్సరం లడ్డూ వేలాన్ని రద్దు చేసిన బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు... పోలీసుల ఆదేశాలతో... భక్తులెవరూ రావొద్దని కోరింది. ఐతే... భక్తులు మాత్రం వస్తూనే ఉన్నారు. రెండోరోజు 6 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన స్వామికి సాదాసీదాగా పూజలు జరిపారు. ఐతే... నిన్న తొలి రోజు బాలాపూర్ గణేశుడికి పూజలు చేశారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వర సిద్ధి వినాయకుడికి స్వయంగా పూజలు చేసిన మంత్రి సబిత... కరోనా నుంచి ప్రజల్ని కాపాడాలని కోరారు. మంత్రిని సన్మానించిన నిర్వాహకులు.. లడ్డూ ప్రసాదం ఇచ్చారు.
ప్రస్తుతం భక్తులు వస్తూనే ఉండటంతో... గణేష్ మండపం దగ్గర శానిటైర్లు ఏర్పాటుచేశారు. మాస్క్ ఉన్నవారిని మాత్రమే స్వామి వారి దర్శనానికి రానిస్తున్నారు. మొదటి రోజు భక్తుల సంఖ్య తక్కువగానే ఉండేలా చేసుకున్న నిర్వాహకులు... ఇవాళ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. మరోవైపు నాల్రోజులుగా GHMCలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో... ఉత్సవ కమిటీ నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. భక్తుల సంఖ్య మరీ ఎక్కువైతే... నిన్న ఖైరతాబాద్ గణేశుడికి తెర వేసినట్లు... బాలాపూర్లో కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi 2020