హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న టీవీ9 ఆఫీస్‌ను ముట్టడించారు భజరంగదళ్ కార్యకర్తలు. ఉదయం 11.30 గంటలకు టీవీ9 కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చారు. దీపావళి సందర్భంగా హిందువులపై టీవీ 9 హిందూ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తుందని మండిపడ్డారు. వాటిని ఖండిస్తూ టీవీ9 ఆఫీస్ ఎదుట బజరంగ్దాల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాణాసంచ కాల్చుతూ వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీవీ9 వద్దకు చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Telangana Politics, TV9