Home /News /telangana /

BABU JAGJEEVAN RAM JAYANTHI CELEBRATIONSVS MDK

Babu jagjeevanram jayanthi... ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

babu jagjveen ram

babu jagjveen ram

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. నివాళులు అర్పించిన సీఎం , పలువురు మంత్రులు ,ఎమ్మెల్యేలు అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడిన నాయకులు...babu jagjeevan ram jayanthi celebrations,cm kcr,ministers harish rao and koppula eshwar and ycp leader sharmila paid tribute to babu jagjeevan ram

ఇంకా చదవండి ...
అణగారిన వర్గాలను అభ్యున్నతికి పోరాడిన యోధుడు, మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్..BABU JAGJEEVAN RAM దళితులు ఇతర వర్గాల కోసం పార్లమెంట్ లో క్రుషి చేసి, చరిత్రలో నిలిచి పోయిన నాయకుడి జయంతి నేడు.. ఈ నేపథ్యంలోనే ఆయన 114 వ జయంతి వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ తోపాటు ఇతర పార్టీల నేతలు ఎమ్మెల్యేలు ఈ జయంతి వేడుకల్లో పాల్గోన్నారు.

తెలంగాణలో బాబూ జగ్జీవన్ రామ్ 114 వ జయంతి వేడుకలు

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు..ఈ సంధర్భంగా ఆయన చేసిన సేవలను కోనియాడారు. కులరహిత సమాజం కోసం బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో పాటుపడ్డారని సీఎం కొనియాడారు. ఇక రాష్ట్రంలోని పలువురు మంత్రులు ప్రత్యేకంగా దళితులకు చేసిన సేవలను స్మరించుకున్నారు...ఆర్దికంగా దళితులను అభివఈద్ది లోకి తీసుకువచ్చేందుకు పార్లమెంట్ లోనే ఎంతో క్రుషి చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు.

సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో పార్లీల నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు బాబూ జగ్గీవన్ రామ్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో బాగంగానే సిద్దిపేటలోని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహనికి ఆర్ధిక మంత్రి హరిష్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించారని మంత్రి వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వైఎస్ షర్మిల నివాళి...

మరోవైపు తెలంగాణలో రాజకీయ పర్యటనలు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నేత బాబూ జగ్జీవన్ రామ్ సేవలను గుర్తుచేసుకున్నారు.. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన సంఘ సంస్క‌ర్త, డాక్ట‌ర్ బాబూ జగ్జీవన్‌ రామ్‌. ఆయ‌న చ‌రిత్ర‌ స్ఫూర్తిదాయకం. ఆ మ‌హ‌నీయుడి జ‌యంతి సంద‌ర్భంగా నివాళి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు...

బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించిన షర్మిల


బాబూ జగ్జీవన్ రామ్ నేపథ్యం...

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ లో జన్మించారు. 1920 లో పాఠశాల విద్య 1926 లో మెట్రిక్యులేషన్ ను పూర్తి చేశారు. 1931లో కలకత్తా యూనివర్శిటి నుండి బీఎస్సీ పూర్తి చేశారు. అప్పటి నుండే సామాజిక ఉద్యమాల్లో పోరాటాలు చేస్తూ స్వాంతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు... అనంతరం 27 ఏళ్ల వయస్సులోని అంటే 1935 లోనే బీహార్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన నెహ్రు క్యాబినెట్ లో అంత్యంత పిన్నవయస్కుడిగా మంత్రి పదవి పోందిన వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ ..ఈ నేపథ్యంలోనే కేంద్రంలో మొదటిసారి కార్మిక మంత్రిగా వ్యవసాయ, రవాణ మరియు కమ్యునికేషన్ల, రక్షణ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించి అనేక సంస్కరణలకు
శ్రీకారం చుట్టారు... చివరకు స్వంత పార్టీపైన తిరుగుబావుటా ఎగరవేసి జనతా పార్టీ హాయంలో ఉప ప్రధానిగా ఎన్నికయ్యారు.. కాగా మొత్తం తన రాజకీయ జీవీతంలో 50 ఏళ్లపాటు ఎంపీగా ...ముప్పై ఏళ్ల పాటు మంత్రిగా తన సేవలు అందించిన ఘనత బాబూ జగ్జీవన్ రామ్ ది...
Published by:yveerash yveerash
First published:

Tags: CM KCR, Harish Rao, YS Sharmila

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు