నేడు మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తివేత.. అప్పటివరకు..

బాబ్లీ ప్రాజెక్ట్

కేంద్ర జల వనరుల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.

  • Share this:
    గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు ఎత్తివేయనున్నారు. కేంద్ర జల వనరుల శాఖ అధికారుల సమక్షంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు ఎగువున గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు ఎత్తనున్నట్లు ఎస్సారెస్పీ ఈఈ రామరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచాల్సి ఉంటుంది.

    బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
    First published: