హోమ్ /వార్తలు /తెలంగాణ /

Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, బస్సు ఢీకొని నలుగురు మహిళలు దుర్మరణం

Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, బస్సు ఢీకొని నలుగురు మహిళలు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: క్షతగాత్రుల్లో నలుగురు మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో.. వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ నలుగురూ మరణించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhongir, India

యాదాద్రి భువనగిరి (Yadadri Bhongir) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆటో- బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. చౌటుప్పల్ మండల పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులోని దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ నుంచి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది.

ఇది మినీ హైదరాబాద్ .. ఈ ఊరిలో ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లే.

రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో... ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రుల్లో నలుగురు మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో.. వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ నలుగురూ మరణించారు. మృతులను అనసూయ(55), ధనలక్ష్మీ(35), శిరీష(30), నాగలక్ష్మి (28), గుర్తించారు. మృతులు ఓ పచ్చళ్ల పరిశ్రమలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Bhongir, Local News, Road accident, Telangana

ఉత్తమ కథలు