ఆటోలో బంగారు నగలు మర్చిపోయిన మహిళ.. రంగంలోకి దిగిన పోలీసులు.. అంతకంటే ముందే..

ఆటోడ్రైవర్ అజ్జూ

హాలీమా అను మహిళ రామగుండం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కి తిలక్ నగర్ డౌన్ వద్ద ఆటో దిగింది.

  • Share this:
    ఈకాలంలో పది రూపాయలు ఎక్కడైనా మర్చిపోయిన అది మళ్లీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఓ మహిళ ఆటోలో మర్చిపోయింది. ఈ విషయం ఆలస్యంగా గమనించింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం గురించి చెప్పింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఆటోడ్రైవర్‌ను సాధ్యమైనంత తొందరగా పట్టుకుని సొమ్ము రికవరీ చేసే చర్యలు మొదలుపెట్టాలని భావించారు. కానీ వాళ్లకు అంత అవసరం లేకుండా పోయింది. వాళ్లకంటే ముందే నిజాయితీపరుడైన ఆ ఆటోడ్రైవర్.. ఆ నగల బ్యాగ్‌ను మరో పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. ఈ పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటు చేసుకుంది.

    హాలీమా అను మహిళ రామగుండం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కి తిలక్ నగర్ డౌన్ వద్ద ఆటో దిగింది. అయితే తొందరలో ఆటోలో తన బ్యాగ్‌ని మరచిపోయింది. అయితే కొద్దిసేపటికే ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. తన బ్యాగ్‌లో 12 తులాల బంగారం ఉన్నట్లు వెల్లడించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆటో డ్రైవర్ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆ ఆటో డ్రైవర్ అజ్జూ.. వాళ్లకంటే ముందుగానే మహిళ మర్చిపోయిన నగల బ్యాగ్‌ను గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అప్పగించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజాయితీగా తనకు దొరికిన నగల బ్యాగ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఇచ్చిన అటో డ్రైవర్ అజ్జూ‌ను పోలీసు అధికారులు అభినందించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: