Home /News /telangana /

AUTO DRIVER GIVEN CASH BAG RETURN WHICH WAS FORGETTEN IN HYDERBAD VRY

Auto driver : ఆటో డ్రైవర్ నిజాయితీ.. మరిచిపోయిన డబ్బు బ్యాగ్ వాపస్... ఎంతంటే..

Auto driver : ఆటో డ్రైవర్ నిజాయితీ.. మరిచిపోయిన డబ్బు బ్యాగ్ వాపస్...

Auto driver : ఆటో డ్రైవర్ నిజాయితీ.. మరిచిపోయిన డబ్బు బ్యాగ్ వాపస్...

Auto driver : నగరంలోని మరో ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటాడు.. ప్రయాణికుడు మరిచిపోయిన లక్ష రూపాయల బ్యాగ్‌ తిరిగి అప్పగించాడు.. దీంతో ఆ ఆటో డ్రైవర్‌ను అభినందించిన పోలీసులు ప్రోత్సహక బహుమతిని అందించారు.

    సాధారణంగా ఆటో ప్రయాణికులు వారి వస్తువులు మరిచిపోతారు.. అయితే అందులో ఒక్కోసారి విలువైన వస్తువులతో పాటు డబ్బులు కూడా ఉంటాయి. అయితే ఇలా మరిచిపోయిన వస్తువులను తిరిగి తెచ్చి ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలా తాజాగా ఓ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్న సంఘటన వెలుగు చూసింది.

    వివరాల్లోకి వెళితే ధూల్‌పేటలో నివసించే రాంరాజ్‌ తివారీ అనే అర్చకుడు సోమవారం ఉదయం తన కూతురు వివాహానికి సంబంధించి రూ.1.25 లక్షల నగదుతో పాటు వివాహ పత్రికలను ఓ బ్యాగులో సర్దుకొని బంజారాహిల్స్‌రోడ్‌ నెం. 12లోని గుడిలో పూజ చేయించేందుకు షేక్‌పేటలో ఆటో ఎక్కారు బ్యాగ్‌ని ఆటోలోనే వదిలేసి దిగిపోయాడు. కొద్దీ దూరం వెళ్లిన తర్వాత గమనించిన ఆటో డ్రైవర్ హుస్సేన్ ఆ నగదు బ్యాగ్ తీసుకోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించేందుకు వచ్చారు.

    ఇది చదవండి : బట్టల షాపులోకే దూసుకు వచ్చిన బైకర్.. వీడియో చూస్తే.. షాక్..


    ఇదే సమయంలో తివారీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అప్పటికప్పుడే ఆ నగదు సంచిని పోలీసులు రాంరాజ్‌ తివారీకి ఆటో డ్రైవర్‌ చేతుల మీదుగా బంజారాహిల్స్‌ ఎస్‌ఐలు కె. ఉదయ్, అజయ్‌ కుమార్‌లు అప్పగించారు.



    ఆటోడ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు అభినందించి ప్రోత్సాహక బహుమతి అందచేశారు. ఇక తివారీ ఆటో డ్రైవర్ కి కృతఙ్ఞతలు తెలిపారు. ఇది కూతురు పెళ్లికోసం దాచుకున్న డబ్బని. బ్యాగ్ మర్చిపోవడంతో గుండె ఆగినంత పనైందని.. ఆటోడ్రైవర్ దేవుడలా వచ్చి తన బ్యాగ్ ఇచ్చారని ఆయన చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderbad, Money, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు