Home /News /telangana /

AUTHORITIES HAVE TAKEN STEPS TO PROVIDE DRINKING WATER TO WILDLIFE IN A FOREST AREA IN MAHABUBNAGAR IN THE WAKE OF THE SUMMER MBNR PRV

Water For Animals: ఎండాకాలంలో వన్యప్రాణుల కోసం అటవీ అధికారుల చర్యలు.. ప్రతీ తొమ్మిది కిలోమీటర్లకు ఒక నీటి వనరు.. వివరాలివే..

నీళ్లు తాగుతున్న వన్యప్రాణులు

నీళ్లు తాగుతున్న వన్యప్రాణులు

ఎండాకాలం వచ్చేసింది. కొన్ని జంతువులు నీటి కోసమే జనావాసాల్లోకి పొలాల్లోకి వస్తుంటాయి. వాటి అవసరాలను ముందుగానే గుర్తించిన అటవీశాఖ  (Forest Department)వివిధ రూపాల్లో నీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది.

    (న్యూస్ 18, మహబూబ్ నగర్, సయ్యద్ రఫీ)

    మండుతున్న ఎండలతో అడవి (Forest) ప్రాంతం లోని ఊట కుంటలు చెక్ డ్యామ్ (Check dams) లు చెరువులు వాగులు ఎండిపోయాయి. ఈ సమయంలో వన్య ప్రాణులకు (For wildlife Animals) నీటి వసతి లేక అల్లాడుతున్నాయి. కొన్ని జంతువులు నీటి కోసమే జనావాసాల్లోకి పొలాల్లోకి వస్తుంటాయి. వాటి అవసరాలను ముందుగానే గుర్తించిన అటవీశాఖ  (Forest Department)వివిధ రూపాల్లో నీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఎక్కడ సమస్య తలెత్తకుండా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. మహబూబ్​నగర్​  (Mahbubnagar)జిల్లాలో అడవి విస్తీర్ణం 54 వేల ఎకరాలు కాగా అందులో చిరుత, జింకలు, ఎలుగుబంట్లు, ఫైనల్ నెమళ్ళు, అడవి పందులు, అడవి గేదెలు, నక్కలు, ముంగిస, పాములు తదితరాలు ఉన్నాయి.

    ప్రతీ జోన్​కు 400 ఎకరాలు..

    మహబూబ్​నగర్​ (Mahbubnagar)లోని మహమ్మదాబాద్ ప్రాంతాలను రేంజర్ గా ఏర్పాటు చేశారు. వాటి పరిధిలో 21 బ్లాక్ లు ఉన్నాయి. ప్రతి బ్లాక్ పరిధిలో రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు అడవి విస్తీర్ణం ఉంటుంది. వాటిలో 242 కంపార్ట్మెంట్ జోన్లు లు ఉన్నాయి. ప్రతి జోన్ (Zone) కింద 200 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు అడవి విస్తీర్ణం ఉంది. వాటిని పర్యవేక్షించడానికి 29 మంది అధికారులు ఉన్నారు. వారే రోజు తమకు కేటాయించిన ఈ ప్రాంతంలోని వన్యప్రాణులను (wildlife Animals) తాగు నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి తొమ్మిది కిలోమీటర్లు ఒక నీటి వనరు (Water source) తప్పనిసరిగా ఉండాలి. అలా లేకపోతే అక్కడ అ కృతిమంగా వనరులను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం రూ 15 వేలు ఖర్చు పెట్టడానికి నేలపై సాసర్ ఆకారంలో నిర్మాణంలో చేపడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు అరవై ఎనిమిది చోట్ల నిర్మించారు. నాలుగు వేల చొప్పున విచ్ చేస్తూ 82 చోట్ల జంట రింగులను ఏర్పాటు చేశారు. అద్దె ప్రతిపాదికన ట్రాక్టర్ ట్యాంకర్ ఏర్పాటుచేసి వాటి నీటి నింపుతున్నారు.

    ఒక్కసారి నీరుపోస్తే ఐదు నుంచి ఏడు  రోజుల వరకు ఉంటుంది . వర్షాలు కురిసే వరకు నీటిని అందిస్తూనే ఉంటారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో సౌరశక్తితో నడిచే మోటర్లు ఏర్పాటు చేసి వన్య ప్రాణుల  దాహార్తి తీరుస్తున్నారు .

    నిరంతరం పర్యవేక్షణ

    "అడవి (forest) ప్రాంతంలోని జంతువు జలానికి నీటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. నీటిని అందించేందుకు చాలాచోట్ల నిర్మాణాలు చేపట్టాం. మా సిబ్బంది వారికి కేటాయించిన అడవి ప్రాంతంలో పర్యటిస్తూ నీరు ఉందో లేదో పరిశీలిస్తున్నారు ఎక్కడైనా నిర్మాణాలు అవసరమైతే ప్రతిపాదనలు పంపిస్తున్నారు".

    ‌‌‌‌-గంగిరెడ్డి,  అటవీ శాఖ అధికారి, మహబూబ్​నగర్​

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Animals, Forest, Mahbubnagar, Summer, Water

    తదుపరి వార్తలు