బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. ఆ ఘటనకు వారే పూర్తి బాధ్యులు

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

కార్మికుడు బలై.. పదిరోజులైనా ఆచూకీ కనుక్కోలేని స్థితిలో ఉంటే కార్మికుల కుటుంబాలకు భరోసా ఏలా అందిస్తారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి.. సంపాదనే ధ్యేయంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు.

  • Share this:
    అధికారుల నిర్లక్ష్యం వల్లే సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతిచెందాడని, దీనిపై కేంద్ర మంత్రి, మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేస్తానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 రోజుల క్రితం సింగరేణి గనిలో మృతిచెందిన కోడెం సంజీవ్ పార్థివ దేహానికి నివాళులు ఆర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం శిక్షణ ఉన్న కార్మికులనే విధుల్లోకి తీసుకోవాలని, ఏలాంటి అనుభవం లేని సంజీవ్‌ను అధికారులు బెదిరించి విధుల్లోకి పిలిచారని మండిపడ్డారు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని, అధికారులే దీనంతటికి పూర్తి బాధ్యులని పేర్కొన్నారు. కార్మికుడు బలై.. పదిరోజులైనా ఆచూకీ కనుక్కోలేని స్థితిలో ఉంటే కార్మికుల కుటుంబాలకు భరోసా ఏలా అందిస్తారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి.. సంపాదనే ధ్యేయంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. తక్షణమే సంజీవ్ కుటుంబాన్ని అదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.
    Published by:Narsimha Badhini
    First published: