(G.SrinivasaReddy,News18,Khammam)
దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్రెం గ్రామానికి చెందిన 16 మంది మావోయిస్టులు దంతెవాడ జిల్లా ఏస్పీ అభిషేక్ పల్లవ ఎదుట లొంగి పోయారు. అయితే వీరు ఇలా లొంగి పోవటం మావోయిస్టు లకు ఒక ఎదురు దెబ్బ అనె చెప్ప వచ్చు. ప్రస్తుతం మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యం లో ఇలా వీరు లొంగి పోవటం మావోయిస్టు లకు ఎంత మేర నష్టం జరుగుతుంది అనేది వేచి చూడాలి. వీళ్లు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు , మావోయిస్టులు అడవిలో ఉండి సాధించేది ఏమి లేదని జన జీవన స్రవంతి లో కలిసి ప్రభుత్వాలు.. అందించే సదుపాయాలను అందిపుచ్చుకోవాలని అతడు ప్రచారం నిర్వహించాడు.
దాని కారణంగా 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు SP అభిషేక్ పల్లవ్. అంతక ముందు ఎంతో మంది మావోయిస్టులు లొంగిపోగా.. వాళ్లకు కూడా ఇలాంటి సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాయని.. దాని ప్రకారంగానే ఇప్పుడు వీళ్లు కూడా లొంగిపోయారని తెలిపాడు. ఇదిలా ఉండగా.. మరో ఘటనలో.. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న బాలాఘాట్ జిల్లా లాంచీ పోలిస్ స్టేషన్ పరిధిలో కోరిక గ్రామ సమీపంలో రహదారి నిర్మాణంలో ఉన్న రోడ్డు రోలర్ తో పాటు మరికొన్ని వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు.
ఆ ప్రదేశంలో బ్యానర్లు, కరపత్రాలను వదిలివెళ్లారు. ఇలా అక్కడ నుంచి వెళ్లిన వారిలో దాదాపు 40 మంది నక్సలైట్లు పాల్గొన్నట్టు సమాచారం. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు రోడ్డు నిర్మాణం చేపడుతున్న సాయి దత్త సంస్థకు చెందిన రోడ్డు రోలర్ ను మావోయిస్టులు దగ్ధం చేశారు. ఏటూరు నాగారం మధ్యలో సాయి దత్త కన్స్ట్రక్షన్ బీటీ రోడ్డు నర్మాణ పనులో ఉంది. బిటి రోడ్డు రోలింగ్ చేస్తన్న వాహనాన్ని సాయి దత్త కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు రోడ్డు పక్కకు నిలిపారు.
మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా రోలర్ని మావోయిస్టులు దగ్ధం చేసేందుకు నిప్పు అంటించారు. కానీ ఎంతకు కాలకపోవడంతో.. వదిలిపెట్టి వెళ్లారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మావోయిస్టుల జాడ కోసం పోలీసులు జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఇలా మావోయిస్టులు వచ్చి రోడ్డు రోలర్ కు నిప్పు పెట్టి వెళ్లిపోయి.. పోలీసులకు సవాల్ విసిరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Maoist, Maoist attack